HIT Teaser: మరింత థ్రిల్లింగ్.. భయం.. సస్పెన్స్‏గా హిట్ 2 టీజర్.. పోలీస్ ఆఫీసర్‏గా అడవి శేష్..

|

Nov 03, 2022 | 12:28 PM

శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్

HIT Teaser: మరింత థ్రిల్లింగ్.. భయం.. సస్పెన్స్‏గా హిట్ 2 టీజర్.. పోలీస్ ఆఫీసర్‏గా అడవి శేష్..
Hit 2 Teaser
Follow us on

క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇందులో మీనాక్షి చాదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి త్రిపిరినేని ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా ఈ సినిమమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు అడివి శేష్. ఆయన విధులు నిర్వర్తిస్తోన్న ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ అమ్మాయి హత్యకు గురి అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఆమెను దారుణంగా హత్య చేసింది ఎవరు? ఈ హత్య వెనకున్న కారణం ఏమిటి? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది.

థ్రిల్, యాక్షన్, ఫన్ వంటివి కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హిట్ 1, హిట్ 2 మధ్య రిలేషన్ ఉందని గతంలోనే రివీల్ చేశారు మేకర్స్. ఈ టీజర్‌ను బ్యాంగ్‌తో మేకర్స్ పూర్తి చేశారు. టీజర్‌ను చూస్తుంటే మూవీ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ లెవల్లో విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి