sarkaru vaari paata: మ‌హేష్ బాబు చెప్పిన స‌మ‌యానికి రావ‌డం లేదా.? స‌ర్కారు వారి పాట ఆల‌స్యం కానుందా..

sarkaru vaari paata: క‌రోనా మ‌హ‌మ్మారి (Corona) అన్ని రంగాల‌ను ప్ర‌భావితం చేసిన‌ట్లే సినిమా ఇండ‌స్ట్రీనిపై సైతం తీవ్ర ప్ర‌తికూల‌త‌ను చూపించింది. ముఖ్యంగా సెకండ్ త‌ర్వాత ప‌రిస్థితులు చక్క‌బ‌డ్డాయి..

sarkaru vaari paata: మ‌హేష్ బాబు చెప్పిన స‌మ‌యానికి రావ‌డం లేదా.? స‌ర్కారు వారి పాట ఆల‌స్యం కానుందా..

Updated on: Jan 14, 2022 | 8:00 AM

sarkaru vaari paata: క‌రోనా మ‌హ‌మ్మారి (Corona) అన్ని రంగాల‌ను ప్ర‌భావితం చేసిన‌ట్లే సినిమా ఇండ‌స్ట్రీనిపై సైతం తీవ్ర ప్ర‌తికూల‌త‌ను చూపించింది. ముఖ్యంగా సెకండ్ త‌ర్వాత ప‌రిస్థితులు చక్క‌బ‌డ్డాయి సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి బ‌డా చిత్రాలు రానున్నాయ‌ని అంద‌రూ సంతోషించారు. అయితే థార్డ్ వేవ్ రూపంతో మ‌రోసారి ఇండ‌స్ట్రీకి గ‌ట్టి దెబ్బ ప‌డింది. దీంతో బ‌డా బ‌డ్జెట్ చిత్రాల‌న్నీ వాయిదా వేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇలా సంక్రాంతికి వాయిదా ప‌డిన భారీ చిత్రాల్లో మ‌హేష్ (Mahesh babu) హీరోగా తెర‌కెక్కిన స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఒక‌టి. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఏప్రిల్ 1కి కూడా వ‌చ్చే అవ‌కాశాలు లేన‌ట్లు క‌నిపిస్తోంది. దీనికి ప‌లు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైంది క‌రోనా ప్ర‌భావం ఎప్పుడు తగ్గుతుంద‌న్న దానిపై ఇంకా ఒక స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం ఒక‌టైతే. మ‌హేష్‌తో పాటు, న‌టి కీర్తి సురేశ్ కూడా క‌రోనా భారిన ప‌డ‌డం మ‌రో కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

ఇక మ‌హేష్‌బాబుకు ఇటీవ‌ల మోకాలి స‌ర్జ‌రీ కూడా కావ‌డంతో సినిమా చిత్రీక‌ర‌ణ మ‌రింత ఆల‌స్యం కానుంద‌ని తెలుస్తోంది. దీంతో స‌ర్కారు వారి పాట మ‌రోసారి విడుద‌ల తేదీని మార్చుకోక త‌ప్ప‌ద‌నే చ‌ర్చ మొద‌లైంది. అన్ని ప‌రిస్థితులు అనుకూలిస్తే ఆగ‌స్టులో సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read: Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..

Hero Movie Pre Release Event: హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. లైవ్ వీడియో

Indian Army New Uniform: హై టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ యూనిఫామ్‌.. ఎలా తయారు చేశారో తెలుసా..