Bigg Boss Telugu 4: టాస్క్ గెలవడానికి అభి ట్రిక్, హర్టయిన హారిక

బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు జంటల హడావిడి ఎక్కువగా కనిపిస్తుందది.  అఖిల్‌- మోనాల్, అవినాష్‌- అరియానా,  అభిజిత్‌-హారిక జంట‌‌లు సన్నిహితంగా మెలుగుతున్నారు.

Bigg Boss Telugu 4: టాస్క్ గెలవడానికి అభి ట్రిక్, హర్టయిన హారిక
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2020 | 12:28 PM

బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు జంటల హడావిడి ఎక్కువగా కనిపిస్తుందది.  అఖిల్‌- మోనాల్, అవినాష్‌- అరియానా,  అభిజిత్‌-హారిక జంట‌‌లు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక అమ్మ రాజశేఖర్-దివి ఒక జట్టుగా కనిపిస్తున్నారు.  తాజా ఎపిసోడ్‌లో హారిక, అభిజిత్‌పై ఇంట్రస్ట్‌ను చెప్పకనే చెప్పింది. త‌ను అభిజిత్ టీమ్ లేనందుకు ఫీలవుతూ, బిగ్  బిస్‌ని పాజిటివ్ సెన్స్‌లో దొంగ అనేసింది. ప్ర‌స్తుతం హౌజ్‌లో మేనేజ‌ర్‌గా ఉన్న అభిజిత్ ..హారికకు స్పెషల్ సర్వీసు చేస్తున్నాడు. ఆమెకు హెడ్ మసాజ్  కూడా చేశాడు. అయితే  అభి టాస్కుల విషయంలో పక్కాగా ఆడతాడు. టాస్కులు గెలిచేందుకు అతడు సామ, దాన, బేధ, దండోపాయాలు ఉపయోగిస్తాడు. ఈ క్రమంలోనే హారికను మచ్చిక చేసుకుని, మాయ చేసి ఆమె వద్ద నుంచి స్టార్స్ కొట్టేశాడు.  ( మెహబూబ్ ఘాటు వ్యాఖ్యలు, ఇచ్చి పడేసిన అఖిల్ )

హారిక త‌న ఇష్ట‌పూర్వ‌కంగా అభిజిత్‌కి ఓ స్టార్ ఇవ్వ‌గా, త‌ను దొంగిలించిన స్టార్ల‌ని తెలివిగా దాచుకున్నాడు. ఈ విష‌యంలో కెమెరా ముందుకు వచ్చి తాను ఒకటే స్టార్ ఇచ్చానని కన్నీరు పెట్టుకుంది హారిక. ‌ఆ తర్వాత రిలీజ్ చేసిన ప్రొమోలో కూడా ఇదే విషయంపై హారిక, అభిల మధ్య బిగ్ బాస్ సాక్షిగా మాటల వార్ నడిచింది. అభి మాత్రం టాస్కు గెలవడానికి నమ్మకద్రోహం చేశాడనే టాక్ నెెటిజన్ల నుంచి వ్యక్తమవుతుంది. నేటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.   ( 2020 : విజయ్ కెరీర్‌లో జీరో ఇయర్‌ ! )