AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

L2: Empuraan Movie: మోహన్ లాల్ ఎల్ 2: ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఎల్ 2: ఎంపురాన్. మరో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ లూసీఫర్ కు సీక్వెల్ గా ఎంపురాన్ మూవీ తెరకెక్కింది.

L2: Empuraan Movie: మోహన్ లాల్ ఎల్ 2: ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
L2 Empuraan Movie
Basha Shek
|

Updated on: Mar 26, 2025 | 9:31 AM

Share

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎల్ 2: ఎంపురాన్’. గతంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా గురువారం (మార్చి 27) న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంపురాన్ సినిమాను విడుదల చేయనుండడం విశేషం. కాగా ఈ సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలే ఉండగా చిత్ర బృందం ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎంపురాన్ చిత్రం నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఆ షాడో పోస్టర్ లో ఉన్నది ఎవరా? అని సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కూడా నటించారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా విడుదలైన ఎంపురాన్ పోస్టర్ లో ఉన్నది అమీరేనని కొందరు బల్ల గుద్ది చెబుతన్నారు. దీనిపై ఒక అభిమాని స్పందిస్తూ.. ‘ఈ ఫోటోలో ఉన్నది అమీర్ ఖానే.. కావాలంటే అతని చెవులు చూడండి అచ్చం అలానే ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు. ‘అవును ఆ పోస్టర్‌లో ఉన్నది కచ్చితంగా అమీర్ ఖానే.. ఎందుకంటే ఆయన సోదరి కూడా చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

అయితే ఈ పోస్టర్ లో ఉన్నది హాలీవుడ్ హీరో రిక్ యూన్ అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఇదే విషయమై ఒక నెటిజన్ ఏఐ గ్రోక్ ను కూడా అడిగాడు. ‘ ఈ పోస్టర్‌లో డ్రాగన్‌కి ఎదురుగా ఉన్న సూట్‌లో వెనుక నుంచి ఒక వ్యక్తి కనిపిస్తాడు.. అది బహుశా మోహన్‌లాల్ అయి ఉండొచ్చు. ముఖం కనిపించకుండా ఉన్న ఈ పోస్టర్‌కు రిక్ యున్‌తో పెద్దగా పోలిక లేదు. ఈ శైలి యున్ యాక్షన్ పాత్రలను సరిపోలినప్పటికీ.. కానీ భౌతికంగా చూస్తే ఆ పోలిక అస్పష్టంగా ఉంది అని గ్రోక్ ఆన్సర్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మొత్తానికి ఎంపురాన్ మూవీ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో ఉన్న మిస్టరీ మ్యాన్ ఎవరో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!