ఆకాశ్ పూరీ జోడీగా రొమాంటిక్ హీరోయిన్

| Edited By:

Mar 12, 2019 | 7:07 AM

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కేతికా శర్మ నటించనుందని నటి ఛార్మి ప్రకటించింది. రొమాంటిక్ సినిమాలో ఆమె ఆకాశ్ సరసన సందడి చేయబోతుందని తెలిపింది. కేతికా శర్మకు ఇది తొలి సినిమా. ఆమె పూరీ కనెక్ట్స్‌లో నటనపై శిక్షణ తీసుకుంది. పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే, డైలాగులు, కథ అందిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ […]

ఆకాశ్ పూరీ జోడీగా రొమాంటిక్ హీరోయిన్
Follow us on

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కేతికా శర్మ నటించనుందని నటి ఛార్మి ప్రకటించింది. రొమాంటిక్ సినిమాలో ఆమె ఆకాశ్ సరసన సందడి చేయబోతుందని తెలిపింది. కేతికా శర్మకు ఇది తొలి సినిమా. ఆమె పూరీ కనెక్ట్స్‌లో నటనపై శిక్షణ తీసుకుంది. పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే, డైలాగులు, కథ అందిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.