ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన.. పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ నటుడిగానే కాకుండా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక పవన్ నటించిన ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..

ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన.. పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
Og Movie

Updated on: Jun 06, 2026 | 4:38 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీబాధ్యతలు నిర్వర్తిస్తూనే సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు పవన్. కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అంతకు ముందు విడుదలైన ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన ఓజీ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ఆసక్తిగా సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ బ్రెయిన్ కు సంబందించిన శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు ఆమెకు ఓజీ సినిమా చూపిస్తూ సర్జరీ చేశారు వైద్యులు. కోటేశ్వరమ్మ గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్  రావడంతో ఆమెను హాస్పటల్ కు తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. వైద్యపరీక్షలు చేసిన అనంతరం ఆమె మెదడులో ఓ గడ్డను గుర్తించారు వైద్యులు.

బ్రెయిన్ సర్జరీ కావడంతో వైద్యులు ఆమెకు మత్తు ఇవ్వలేదు. సర్జరీ సమయంలో ఆమె శరీరంలో కదలికలు గుర్తించాలని దాంతో వైద్యులు ఓ ఉపాయం ఆలోచించారు. కోటేశ్వరమ్మకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.. దాంతో ఆపరేషన్ థియేటర్‌లోనే ల్యాప్ టాప్ లో పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ను పెట్టి సర్జరీ చేశారు వైద్యులు. ఆమె సినిమాలో లీనాలైపోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఆమె బ్రెయిన్ లోని గడ్డను తొలగించారు వైద్యులు. ప్రస్తుతం కోటేశ్వరమ్మ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆమె వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us