Tollywood: తెలుగునాట మరో విషాదం.. పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి కన్నుమూత

|

Jan 27, 2023 | 12:58 PM

సినిమా ఇండస్ట్రీలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో మృతిచెందారు.

Tollywood: తెలుగునాట మరో విషాదం.. పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి కన్నుమూత
Dubbing Artist Srinivas Murthy
Follow us on

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి శుక్రవారం ఉదయం చైన్నైలో గుండెపోటుతో మరణించారు. యూకేలో ఉన్న కుమారుడు వచ్చాక ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  సూర్య, తల అజిత్, విక్రమ్, మోహన్ లాల్, విక్రమ్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు తన గాత్రాన్ని అందిచారు మూర్తి. బేస్ వాయిస్‌తో ఆయన చెప్పే డైలాగ్స్ హీరోలకు బాగా నప్పేవి. ముఖ్యంగా సూర్య నటించిన సింగం సిరీస్ మొత్తానికి హీరో పాత్రకు శ్రీవివాస మార్తి తన గాత్రం అందించారు. ఆయన డబ్బింగ్ చెప్సిన సినిమాలు చూశాక.. సూర్యకు వేరే వాళ్లు డబ్బింగ్ చెబితే అస్సలు వినబుద్దికాదు. పాత్రకు ఎలాంటి వాయిస్‌ కావాలో అందుకు అనుగుణంగా ఆయన గాత్రాన్ని సరిచేసుకునేవారు.

సినిమా పరిశ్రమలో ముఖ్యమైన భాగం అయినప్పటికీ, డబ్బింగ్ ఆర్టిస్టులు తెరవెనుక పని చేయడం వల్ల వారిని పెద్దగా ప్రజలు గుర్తించరు. కాగా ఇటీవల కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల ద్వారా శ్రీనివాస మూర్తి జనాలకు పరిచయమయ్యారు. దాదాపు వెయ్యి పైగా చిత్రాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను దక్షిణాది ప్రాంతీయ భాషల్లోకి, ముఖ్యంగా తెలుగులోకి అందించడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్‌లకు కూడా తన గాత్రాన్ని అందించాడు. ఆయన డబ్బింగ్ చెప్పిన తెలుగు మూవీ శివయ్యకు గానూ 1998లో ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డును అందుకున్నారు. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..