Balagam: భావోద్వేగానికి గురి చేసిన బలగం.. 45 ఏళ్ల తర్వాత ఒక్కటైన కుటుంబం
సినిమా చూసిన ప్రతిఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాను పలు గ్రామాల్లో తెరలు వేసి మరి ఈ సినిమా చూస్తున్నారు ప్రజలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు.
రీసెంట్ డేస్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బలగం ఒకటి. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు వేణు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లు రాబడుతోంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాను పలు గ్రామాల్లో తెరలు వేసి మరి ఈ సినిమా చూస్తున్నారు ప్రజలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా అన్న చెల్లెలి మధ్య ఉండే అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు దర్శకుడు వేణు.
ఇక ఈ సినిమా చేసిన తర్వాత చాలా మంది తమ కుటుంబాలతో కలిసిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా చూసి తమ కుటుంబానికి దగ్గరవుతున్నారు. చాలా మంది తమ కుటుంబాల్లో నెలకొన్న గొడవలు, విబేధాలను పరిష్కరించుకుని ఒక్కటవుతున్నారు.
తాజాగా బలగం సినిమా చూసి ఒక కుటుంబం 45 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన బాన్ రెడ్డి-పోసక్క దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అయితే కూతుళ్లకు పెళ్లిళ్లు కావడం, కొడుకులు విడిగా కాపురాలు పెట్టడంతో మంచిర్యాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే బాన్ రెడ్డి పెద్ద కొడుకు వీరందరిని రప్పించి బలగం సినిమా చూపించారు. బలంగా చూసి భావోద్వేగానికి గురై అందరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి గెట్ టూ గెదర్ పెట్టుకొని సందడి చేశారు.