Sankranti Movies: సంక్రాంతికి సినిమాల జాతర.. హిట్టు కొట్టేది ఎవరు… ?

న్యూఇయర్ సందడి ముగిసింది. కొత్త ఏడాది సంబరాలు మిన్నంటాయి. ఇక ఇప్పుడు సినిమా ప్రపంచంలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ఈ పండక్కి ఎలాగైనా హిట్టు కొట్టాలని వెయిట్ చేస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు. అగ్ర తారలతోపాటు యంగ్ హీరోలు సైతం ఈ సంక్రాంతి పండక్కి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అందుకే ఈసారి ఏడాది ప్రారంభంలో హిట్టు కొట్టేది ఎవరో చూడాల్సిందే.

Sankranti Movies: సంక్రాంతికి సినిమాల జాతర.. హిట్టు కొట్టేది ఎవరు... ?
Sankranthi Movies

Updated on: Jan 02, 2026 | 5:57 PM

కొత్త ఆశయాలు.. కొత్త కలలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. న్యూఇయర్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఇదెలా ఉంటే.. 2026పై కోటి ఆశలు పెట్టుకున్నారు మన టాలీవుడ్ హీరోలు. అలాగే ఈసారి సంక్రాంతి పండక్కి ఎలాగైనా హిట్టు కొట్టాలని వెయిట్ చేస్తున్నారు కొందరు హీరోలు. గతేడాది నూతన సంవత్సర ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. ఇక ఈసారి అలాంటి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న యంగ్ హీరోలు సైతం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

భారీ బడ్జెట్ చిత్రాలతోపాటు.. చిన్న చిన్న సినిమాలు సైతం ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో చిన్న సినిమాలు సత్తా చాటాయి. పదేళ్లుగా హిట్టు కోసం వెయిట్ చేసిన యంగ్ హీరోస్ సైతం సక్సెస్ అయ్యారు. ఇప్పుడు థియేటర్లలో శంబాల, సైక్ సిద్ధార్థ, దండోరా వంటి చిత్రాలు విజయవంతంగా దూసుకుపోతున్నాయి. అలాగే ఎప్పుడూ లేనివిధంగా ఈసారి సంక్రాంతికి ఏకంగా ఏడు సినిమాలు విడుదలవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా జనవరి 9న విడుదల కానుంది. డైరెక్టర్ మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

అలాగే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందించిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ మూవీని జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఇవే కాకుండా.. మాస్ మహరాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఇక శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాను జనవరి 14న అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమాను సైతం అదే రోజున విడుదల చేస్తున్నారు.

తెలుగు చిత్రాలు కాకుండా తమిళ్ సినిమాలు సైతం డబ్ చేయనున్నారు. విజయ్ దళపతి నటించిన జన నాయకుడు సినిమాను జనవరి 9న, శివకార్తికేయన్ నటించిన పరాశక్తి జనవరి 10న విడుదల చేయనున్నారు. అయితే ఇప్పుడు అడియన్స్ ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో చూడాలి.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..