
సినిమా ఇండస్ట్రీలో తమన్నా భాటియా ప్రస్థానం ఒక అద్భుతం. 15 ఏళ్లకే కెరీర్ మొదలుపెట్టి, నేటికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. టాలీవుడ్ లో ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి దాదాపు అందరు కుర్ర స్టార్లతో నటించేసింది. అటు సూర్యతో ‘వీడొక్కడే’ వంటి సెన్సేషనల్ హిట్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవితో ఏకంగా మూడు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ, ఇంతటి సుదీర్ఘ కెరీర్‌లో కొందరు అగ్ర హీరోల పక్కన నటించే అవకాశం మాత్రం ఆమెకు ఇంకా రాలేదు. ఆ హీరోలు ఎవరో తెలుసా?
తెలుగులో తమన్నా నటించని ఏకైక అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య ఎనర్జీకి తమన్నా డ్యాన్స్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ సమయంలో తమన్నా పేరు వినిపించినా, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటివరకు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వకపోవడం ఒక లోటుగానే మిగిలిపోయింది.
Tamannaah Bhaatia
కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్లతో కలిసి నటించిన తమన్నా.. దళపతి విజయ్ సరసన మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కూడా ఆమెకు రాలేదు. అజిత్, సూర్య, రజనీకాంత్ వంటి వారితో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటీ, విజయ్ సినిమాలో ఉంటే ఆ క్రేజ్ వేరే లెవల్ లో ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయం.
తమన్నా కెరీర్ హిందీ సినిమాతోనే మొదలైనప్పటికీ, అక్కడ అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ ఆమెకు తక్కువగానే వచ్చింది. కింగ్ ఖాన్ తో కలిసి తమన్నా కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించింది కానీ, సినిమాలో మాత్రం ఇప్పటివరకు నటించలేదు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో కూడా తమన్నాకు ఇప్పటివరకు జోడీ కుదిరే అవకాశం రాలేదు.
ఏదేమైనా తమన్నా ఇంకా ఫామ్ లోనే ఉంది. 2026 వరకు ఆమె డైరీ ఫుల్ గా ఉంది. కాబట్టి, త్వరలోనే ఈ అగ్ర హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా బాలయ్య-తమన్నా కాంబో కోసం నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు!