
ఒక్క సినిమా హిట్ అయితే చాలు డైరెక్టర్లు ఆ హీరో డేట్స్ కోసం క్యూ కడతారు. వరుసగా మంచి స్టోరీలు ఎంపిక చేసుకుంటూ విభిన్నంగా సినిమాలు చేస్తుంటే ఇంకేముంది ఆ హీరో కోసం డైరెక్టర్లు ఎదురుచూస్తారు. యంగ్ డైరెక్టర్లు అయితే ఆ హీరోల కోసం ప్రత్యేకంగా స్టోరీలు రాస్తారు కూడా. ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతోంది ఆ స్టార్ హీరోకు. వరుసగా సినిమాలు చేస్తున్నా కథల ఎంపికలో విభిన్నత్వానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో డైరెక్టర్ల చూపు ఆ హీరోపై పడింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? డైరెక్టర్లు ఎవరు?
తమిళ సూపర్‌స్టార్ కార్తీకి టాలీవుడ్‌లో మార్కెట్ భారీగా పెరిగింది. అభిమానుల లవ్, కమర్షియల్ విలువలతో ఆకట్టుకున్న ఈ హీరో కాల్‌షీట్ల కోసం యంగ్ దర్శకులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇటీవల అన్నగారు వస్తారు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ ఈ రహస్యాన్ని బయటపెట్టాడు. చాలా మంది దర్శకులు నా డేట్స్ కోసం క్యూ కట్టారు. కథలు విన్నానని అయితే ఎవరికీ ఓకే చెప్పలేదని మాత్రం స్పష్టంగా చెప్పాడు కార్తీ.
Karthi
ఈ లిస్ట్‌లో మొదటివాడు శివ నిర్వాణ. ఈ హిట్ దర్శకుడు కార్తీకి ఒక ఆకర్షణీయ కథ నెరేట్ చేశాడు. కానీ, కథా నిర్మాణం వర్కవుట్ కాలేదు. ఆ కథనే తర్వాత రవితేజకు చెప్పి ఓకే చేయించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. రవితేజతో శివ నిర్వాణ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ.
తర్వాత లైన్‌లో ఉన్నది వెంకీ కుడుముల. వెంకీ కూడా కార్తీకి స్క్రిప్ట్ వినిపించాడు. కార్తీ కూడా విని నవ్వారట కానీ మరో కథ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. వెంకీ ఇప్పుడు కొత్త ఐడియాల కోసం ఎదురుచూస్తున్నారని టాక్. అలాగే, నాని హీరోగా ‘సరిపోదా శనివారం’తో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన వివేక్ ఆత్రేయ కూడా కార్తీని కలిసాడట. ఒక ఎమోషనల్ థ్రిల్లర్ కథ చెప్పి, త్వరలో పూర్తి స్క్రిప్ట్ ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తోంది. కార్తీ దీనిపై పాజిటివ్‌గా స్పందించాడని సమాచారం.
Directors
కార్తీ ప్రస్తుతం ‘హిట్ 4’లో లీడ్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈ యంగ్ డైరెక్టర్ల కథలు ఆయన షెడ్యూల్‌ను మరింత బిజీ చేస్తున్నాయి. కార్తీ టాలీవుడ్‌లో మరిన్ని హిట్స్ అందుకుని, పాన్-ఇండియా స్టార్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ క్యూలో ఉన్న ముగ్గురు దర్శకుల్లో ఎవరికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి!