3 Roses : కుర్రాళ్లను ముగ్గులోకి దింపుతున్న ముద్దుగుమ్మలు.. ఆకట్టుకుంటున్న” 3 రోజెస్” టీజర్

తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం

3 Roses : కుర్రాళ్లను ముగ్గులోకి దింపుతున్న ముద్దుగుమ్మలు.. ఆకట్టుకుంటున్న 3 రోజెస్ టీజర్
Aha

Updated on: Nov 06, 2021 | 9:17 PM

3 Roses : తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. గ్లోబెల్ రేంజ్‌లో ప్ర‌తీసారి ఆహా వీక్ష‌కుల కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళ్తోంది. సూపర్ హిట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందిస్తూ దూసుకుపోతున్న ఆహా మరో వైపు టాక్ షోలతోనూ అలరిస్తోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే షో విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికర, సరికొత్త వెబ్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి షో రన్నర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు కనువిందు చేయనున్నారు. పాయల్ రాజ్ పుత్ – ఈషా రెబ్బా – పూర్ణ  ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్ కు 3 రోజెస్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే విడుదలైన ‘3 రోజెస్’ ఫస్ట్ లుక్,  హీరోయిన్ల క్యారక్టర్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. నవంబర్ 12న ఈ సిరీస్‌ని ఆహా లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్  చేయనున్నారు. ఈ క్రమంలో 3 రోజెస్ టీజర్ ను విడుదల చేశారు. రీతూ – జాన్వీ – ఇందు అనే ముగ్గురు అమ్మాయిల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఓటీటీ స్ట్రీమింగ్ ముగ్గురు బ్యూటీస్ గ్లామర్ డోస్ పెంచి కనువిందు చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naga Shaurya’s Lakshya: ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ లిరికల్ వీడియో..

Kamal Haasan Birthday: విక్రమ్‌ వచ్చేశాడు.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్‌

Puneet Raj Kumar: వీరాభిమానం.. పునీత్​ సమాధి ఎదుట పెళ్లి చేసేందుకు వచ్చిన జంట.. చివరకు..