
ప్రస్తుతం దేశం మొత్తం ఒకే సినిమా గురించి మాట్లాడుకుంటుంది. థియేటర్లలో అస్సలు పట్టించుకోని జనాలు.. ఇప్పుడు ఓటీటీలో వెతికి మరీ చూస్తున్నారు. దీంతో డిజిటల్ ప్లాట్ ఫాంపై అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తుంది. అదే ’12th ఫెయిల్’. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషిల జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. ఇందులో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఈ సినిమాకు అంతగా ఆదరణ లభించలేదు. కానీ పాజిటివ్ రివ్యూస్ మాత్రం వచ్చాయి. దీంతో ఈ సినిమాను గతేడాది నవంబర్ 3న తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అంతగా రెస్పాన్స్ అందుకోలేదు. కానీ ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేయగా.. అందరి దృష్టి సినిమాపైనే ఉండిపోయింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది.
’12th ఫెయిల్’ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. మొత్తం 46,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధారంగా 10కి 9.2 రేటింగ్‌తో IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ సినిమా త్రీ ఇడియట్స్, దంగల్, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రేటింగ్స్ సైతం అధిగమించింది. అలాగే గతేడాది విడుదలైన స్పైడర్ మ్యాన్.. అక్రాస్ ది స్పైడర్ వెర్స్ (8.6), ఓపెన్ హైమర్ (8.4), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 (7.9 ) లాంటి చిత్రాల ఐఎండీబీ రేటింగ్ కంటే ఎక్కువ రేటింగ్ ఈ సినిమా సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. ఇండియన్ టాప్ 250 సినిమాల్లో ’12th ఫెయిల్’ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం IMDbలో ఆల్ టైమ్ టాప్-రేటింగ్ పొందిన 92వ చిత్రంగా ర్యాంక్ పొందింది.
ఇండియన్ టాప్ 250 సినిమాల్లో మొదిట ఐదు స్థానాల్లో .. 1993లో వచ్చిన యానిమేటెడ్ సినిమా రామాయణ, మణిరత్నం నాయకుడు, హృషికేష్ ముఖర్జీ గోల్ మాల్, మాధవన్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ ఉన్నాయి. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లతో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేసి గతేడాది అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
12th Fail continues its triumphant journey at the box office 📽️🌠
Thank you for all the love! 🙌 ❤️#12thFailInCinemasBook your tickets today! 🌟https://t.co/9fuUJgojee#ZeroSeKarRestart
Watch #12thFail IN CINEMAS ONLY, a film inspired by a million true stories. 🎥… pic.twitter.com/5cf8DCjPtf
— Vidhu Vinod Chopra Films (@VVCFilms) November 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.