వెంకీమామ పుటినరోజు సందర్భంగా టాలీవుడ్ తారల ట్వీట్లు.. మెగాస్టార్, సూపర్ స్టార్‌తో పాటు..

|

Dec 13, 2020 | 12:42 PM

విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ దిగ్విజయంగా తన సినీప్రయాణాన్ని కొససాగిస్తున్నారు. రామానాయుడు తనయుడిగా..' కలియుగ పాండవులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ పుట్టినరోజు నేడు.

వెంకీమామ పుటినరోజు సందర్భంగా టాలీవుడ్ తారల ట్వీట్లు.. మెగాస్టార్, సూపర్ స్టార్‌తో పాటు..
Follow us on

విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ దిగ్విజయంగా తన సినీప్రయాణాన్ని కొససాగిస్తున్నారు. రామానాయుడు తనయుడిగా..’ కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ పుట్టిన రోజు నేడు. కెరీర్ స్టార్టింగ్ నుండి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. స్టార్ డమ్ ఇమేజ్ లను పక్కన పెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అనేక విజయాలను అందుకున్నాడు వెంకటేష్. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన వెంకీ.. మరోవైపు యాక్షన్ ఎంటర్టైనర్స్ లో నటిస్తూ మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు ఈ వెంకీమామ.

ఇక వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా.. టాలీవుడ్ తారలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ..” ప్రియమైన వెంకీమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఆధ్యాత్మికంగా ఉంటూనే, సరదాగా నవ్వుతూ ఉండటం చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది. నువ్వు హీరోగా చేస్తున్న నారప్ప సినిమా లుక్‌ ఇన్‌టెన్స్‌తో బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. నీకు గొప్ప సక్సెస్‌ రావాలని కోరుకుంటూ.. నీకిది గొప్ప ఏడాది కావాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ..”సూపర్‌ కూల్‌ వెంకీమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు సంతోషం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ మహేశ్ ట్వీట్‌ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ విషెస్ తెలుపుతూ … హ్యాపీ మ్యూజికల్ బర్త్ డే వెంకీమామ అంటూ ట్వీట్ చేసాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా వెంకటేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వెంకటేష్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 నుంచి పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సారి ట్రిపుల్ ఫన్ తో రాబోతున్నాం అని పోస్టర్ ద్వారా చెప్పేసారు చిత్రయూనిట్.