Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరు ఉన్నపలంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 36 ట్వీట్లు ఆయన పేరు మీద పోస్ట్ అయ్యాయి. ప్రస్తుతం దిల్ రాజు సినిమా ఏది విడుదల లేదు.? అలాంటిది ఆయన పేరు ఎందుకు ట్రెండ్ అవుతోందనేగా మీ సందేహం. ఈ ట్రెండింగ్ వెనకాల ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, కియా అద్వానీ చెర్రీకి జోడిగా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ గతేడాది సెప్టెంబర్ 8న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అప్పటి నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ అయితే జరుగుతోంది కానీ సినిమాకు సంబంధించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు.
కనీసం చెర్రీ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయలేదు. దీంతో ఢీలా పడ్డ ఫ్యాన్స్ సినిమా అప్‌డేట్ ఇవ్వండి అంటూ దిల్ రాజు పేరును ట్యాగ్ చేస్తూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక్కరోజులోనే ఏకంగా 36 వేల ట్వీట్స్ చేశారు. దీంతో దిల్ రాజు పేరు ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి ఫ్యాన్స్ అభ్యర్థన మేరకు సినిమా అప్‌డేట్‌కి సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారా.? చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..