AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలోని బుడ్డది ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇప్పుడేమో ప్రొడ్యుసర్.. ఎవరో తెలుసా!

పైన ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ పోజిస్తున్న బుడ్డది ఎవరో మీకు తెలుసా.? ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తన 13 ఏళ్ల కెరీర్‌లో తెలుగులో పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

Tollywood: ఈ ఫోటోలోని బుడ్డది ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇప్పుడేమో ప్రొడ్యుసర్.. ఎవరో తెలుసా!
Tollywood Heroine
Ravi Kiran
|

Updated on: Nov 21, 2022 | 1:10 PM

Share

పైన ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ పోజిస్తున్న బుడ్డది ఎవరో మీకు తెలుసా.? ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తన 13 ఏళ్ల కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అంతేకాదు పలు చిత్రాలలో ఐటెం సాంగ్స్‌లోనూ అలరించింది. ఇక ఆ తర్వాత ఛాన్స్‌లు తగ్గిపోవడంతో నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. ఇంతకీ ఆమెవరో గుర్తుపట్టారా.?

ఇంకెవరో కాదు.. టాలీవుడ్ అందాల భామ ఛార్మీ. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మీ.. యువ హీరోలే కాకుండా స్టార్ హీరోలతో సైతం నటించింది. ‘మాస్’, ‘అనుకోకుండా ఓ రోజు’, ‘లక్ష్మీ’, ‘రాఖీ’ లాంటి పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో కూడా నటించింది. ఇక సినిమా ఛాన్స్‌లు తగ్గిన తర్వాత ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభించింది. కాగా, వీరిద్దరూ కలిసి నిర్మించిన తాజాగా చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఛార్మీ.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

Follow Us
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే?
20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే?
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్