టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన వెంటకేష్ ఇంట్లో విషాదం నెలకొంది. వెంకీ, సురేశ్ బాబుల చిన్నాన్ని దగ్గుబాటి మోహన్ బాబు (77) మంగళవారం కన్నుమూశారు. మోహన్ బాబు.. దివంగత నిర్మాత రానానాయుడు సోదరుడే దగ్గుబాటి మోహన్ బాబు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ బాబు.. ప్రకాశం జిల్లా కారంచేడులో తుదిశ్వాస విడిచారు. మోహన్ బాబు కారంచేడులోని దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఆస్తుల వ్యవహారాలను చూసుకుంటారని సమాచారం.
దగ్గుబాటి మోహన్ బాబు మరణ వార్త తెలిసిన వెంటనే.. నిర్మాత సురేశ్ బాబు కారంచేడుకు చేరుకున్నారు. ఇక రానా, వెంకటేష్, నాగచైతన్యలు బుధవారం కారంచేడుకు వెళ్లనున్నట్లు సమాచారం. దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..