రెమ్యునరేషన్ అప్పటికి ఇప్పటికి పెంచేశాడంట.. ఇమేజ్ పెరగడంతో నిర్మాతకు షాకిచ్చిన నాగబాబు తనయుడు

|

Nov 26, 2020 | 7:10 PM

నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో వరుణ్‌తేజ్ గురించి అందరికి తెలిసిందే. కొత్తదనం, వైవిధ్యం కలబోసిన సినిమాలను ఎంచుకొని అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తాడు.

రెమ్యునరేషన్ అప్పటికి ఇప్పటికి పెంచేశాడంట.. ఇమేజ్ పెరగడంతో నిర్మాతకు షాకిచ్చిన నాగబాబు తనయుడు
Follow us on

నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో వరుణ్‌తేజ్ గురించి అందరికి తెలిసిందే. కొత్తదనం, వైవిధ్యం కలబోసిన సినిమాలను ఎంచుకొని అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తాడు. తన ఫ్యామిలి బ్యాక్‌గ్రౌండ్‌ను ఏ మాత్రం వాడుకోకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. విజయవంతమైన సినిమాలను ఎంచుకొని వరుసగా సక్సెస్ సాధించాడు.

డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేశ్ సినిమాతో నటనలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు వరుణ్. టాలీవుడ్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షెన్‌లో వచ్చిన ఎఫ్ 2 సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌‌‌తో పోటాపోటీగా నటించాడు. దీంతో టాలీవుడ్‌లో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పడు ఎఫ్ 2 కి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3 సినిమా కోసం నిర్మాత దిల్‌ రాజు వరుణ్ సంప్రదించగా.. భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం వరుణతేజ కొర్రపాటి డైరెక్షన్‌లో ఓ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు.