‘‘డియర్ స్టూడెంట్స్’’.. సినీ ప్రముఖుల విన్నపం

| Edited By:

Apr 23, 2019 | 4:17 PM

ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. మార్కులు సరిగా రాకపోవడం వలన కొందరు, ఫెయిల్ అవ్వడం వలన మరికొందరు, బోర్డు తప్పిదం వలన ఇంకొందరు ఇలా పలువురు విద్యార్థులు బలవన్మరణం చేసుకొని ఎన్నో ఆశలు నింపుకొన్న తల్లిదండ్రులకు విషాదాన్ని నింపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యాన్ని చెబుతూ పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. మీలోని భవిష్యత్‌ను మార్కులు ఎప్పుడూ నిర్ణయించలేవు. చదువుల్లోనూ నేను ఎప్పుడూ యావరేజ్ […]

‘‘డియర్ స్టూడెంట్స్’’.. సినీ ప్రముఖుల విన్నపం
Follow us on

ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. మార్కులు సరిగా రాకపోవడం వలన కొందరు, ఫెయిల్ అవ్వడం వలన మరికొందరు, బోర్డు తప్పిదం వలన ఇంకొందరు ఇలా పలువురు విద్యార్థులు బలవన్మరణం చేసుకొని ఎన్నో ఆశలు నింపుకొన్న తల్లిదండ్రులకు విషాదాన్ని నింపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యాన్ని చెబుతూ పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

మీలోని భవిష్యత్‌ను మార్కులు ఎప్పుడూ నిర్ణయించలేవు. చదువుల్లోనూ నేను ఎప్పుడూ యావరేజ్ స్టూడెంట్‌నే. కానీ యానిమేషన్‌లో నేను టాపర్‌ను. చదువులు నన్ను డైరక్టర్ చేయలేదు. నాలోని ఫాషన్ నన్ను సినిమాల వైపు వెళ్లేలా చేసింది. అందుకే మీ ధైర్యాన్ని కోల్పోకండి. డియర్ పేరేంట్స్ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మీ పిల్లలకు నేర్పండి. అంతేగానీ పరీక్షల గురించి మీ పిల్లలపై ఒత్తిడి పెంచకండి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల తరువాత తనువు చాలించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి. కొందరి తప్పు వలన విద్యార్థులు తమ అద్భుత జీవితాలను పోగొట్టుకుంటున్నారు అని ట్వీట్ చేశారు.

మరోవైపు నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. మీ భవిష్యత్‌కు మార్కులు ప్రామాణికం కాదు. జీవితంలో మీరు ఇంకా ఎన్నో ఛాలెంజ్‌లను స్వీకరించాల్సి ఉంటుంది. స్ట్రాంగ్‌గా ఉండండి అంటూ సాయి ధరమ్ తేజ్ తెలిపాడు.