టాలీవుడ్‌లో ఒకే హిట్.. తమిళంలో వరుసగా 3 సినిమాలు! ఇంతకీ ఎవరా యంగ్ బ్యూటీ

ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేం. మొదటి సినిమాతో హిట్ కొట్టి తర్వాత ఒక్క హిట్ కూడా లేని నటులు ఉంటారు. అయినా వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నా, నటన, అందంతో అలరిస్తున్నా.. హిట్ మాత్రం అందనంత ..

టాలీవుడ్‌లో ఒకే హిట్.. తమిళంలో వరుసగా 3 సినిమాలు! ఇంతకీ ఎవరా యంగ్ బ్యూటీ
Tamil Movies

Updated on: Dec 04, 2025 | 9:53 AM

ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేం. మొదటి సినిమాతో హిట్ కొట్టి తర్వాత ఒక్క హిట్ కూడా లేని నటులు ఉంటారు. అయినా వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నా, నటన, అందంతో అలరిస్తున్నా.. హిట్ మాత్రం అందనంత దూరంలోనే ఉంటుంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హద్దులు లేవు. అన్ని భాషలలోనూ నటీనటులకు సమాన అవకాశాలు దక్కుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి సినిమా అవకాశాలు అందుకోవడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని భాషల సినిమాలు చేసే అవకాశం అందుకుంటున్నారు హీరోయిన్లు.  ఈ భాషలో సక్సెస్ అందుకోలేకున్నా, అవకాశాలు తగ్గినా ఏ మాత్రం ఆలోచించకుండా వేరే భాషల వైపు దృష్టిపెడుతున్నారు.

ప్రస్తుతం ఆ జాబితాలో చేరింది యంగ్​ బ్యూటీ కృతిశెట్టి. సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ గుర్తింపును సాధించుకున్న యంగ్ బ్యూటీలలో ఒకరు కృతి. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ సినిమాల్లోనూ రాణిస్తోంది. తనకు ఇష్టమైన హీరోలు చాలామంది ఉన్నారు కానీ, ఒక్క హీరోకి మాత్రమే తను పెద్ద ఫ్యాన్ అంటోంది కృతి.

Krithi Shetty

ఆ హీరో సినిమాలు వస్తే ఆమె మొదటి వరుసలో కూర్చొని చూస్తుందట. ఆ హీరో పేరు వింటేనే ఆమె కళ్లు మెరిసిపోతాయట. ఇంతకీ, కృతి మనసు దోచేసిన ఆ హీరో ఎవరో తాజాగా చెప్పి అందరికీ షాకిచ్చింది కృతి. కార్తీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని, ఆయన సినిమాలను ఫస్ట్ సీట్‌లో కూర్చుని చూసేదానిని అని అప్పటి రోజులని గుర్తుచేసుకుంది.

ప్రస్తుతం కృతి తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. డిసెంబర్​లో కృతి నటించిన మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మొదటిది ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (L.I.K), ప్రదీప్ రంగనాథన్‌తో జోడీగా, విగ్నేష్ శివన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్‌ 18న రిలీజ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీగా ఉన్న ఈ చిత్రం, ఆమె కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకోవచ్చని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

రవి మోహన్​తో ‘జీని’ అనే సినిమాలోనూ నటిస్తోంది కృతి. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. కార్తీతో జోడీగా వస్తున్న ‘వా వాథియార్’. ఈ సినిమా డిసెంబర్‌ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది కృతి.  కాంపిటీషన్ అనే పదానికి తాను పెద్దగా విలువ ఇవ్వనని, ఇండస్ట్రీలో ఎవరి అవకాశాలు వారికే ఉంటాయని చెప్పింది. చూద్దాం.. ఈ సినిమాలతో అయినా కృతి … ఉప్పెన రేంజ్ హిట్ అందుకుంటుందా!