Tollywood : స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే.. ఒక్క వీడియోతో కెరీర్ నాశనం.. ఈ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..
తన నటనతో యువతకు పిచ్చెక్కించిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చిన్న చిన్న పొరపాట్లతో కెరీర్ నాశనం చేసుకున్న తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది.

సినీ గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారో.. ఎవరు విఫలమవుతారో ఊహించడం కష్టమే. ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. తన అందం, నటనతో యువతకు పిచ్చెక్కించేసింది. ఆమెకు సినీతారలు, క్రికెటర్స్ సైతం అభిమానులు అయ్యారు. ఒక పెద్ద రాజకుటుంబానికి చెందిన ఆమె.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కెరీర్ తొలినాళ్లల్లలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది. కానీ ఒక్క వీడియోతో ఆమె కెరీర్ రాత్రికి రాత్రే నాశనమైంది. ఆమె జీవితం తలకిందులైంది. ఆ వీడియో తన జీవితంలో పెను ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయి.. నటనకు దూరంగా ఉండిపోయింది. ఆమె పేరు రియా సేన్. రాజకుటుంబానికి చెందిన ఆమె.. ప్రముఖ హిందీ, బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ కుమార్తె.. సుచిత్ర సేన్ మనవరాలు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..
రియా అమ్మమ్మ కూచ్ బెహార్ యువరాణి కాగా, ఆమె అమ్మమ్మ సోదరి, ప్రసిద్ధ గాయత్రీ దేవి, జైపూర్ రాణి. అంతేకాకుండా, రియా తండ్రి కుటుంబం త్రిపుర రాజకుటుంబంతో సంబంధం కలిగి ఉంది. ఈ విధంగా, మూడు రాజకుటుంబాల వారసత్వాన్ని పొందిన రియా, తన బాల్యాన్ని అత్యంత వైభవంగా గడిపింది. రియా 1991లో ‘విష్కన్య’ చిత్రంలో బాలనటిగా, ఆ తర్వాత 2001లో ‘స్టైల్’ చిత్రంలో కథానాయికగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పుడప్పుడే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అదే సమయంలో ఆమె జీవితం మలుపు తిరిగింది. 2005లో ఆమెకు సంబంధించిన ఒక వీడియో లీక్ కావడంతో ఆమె లైఫ్ మారిపోయింది. అయితే ఆ వీడియో ఫేక్ అంటూ రియా ఖండించినప్పటికీ అప్పటికే ఆమె కెరీర్ నాశనమయ్యింది. రియా సేన్.. తన సినిమాల వల్ల మాత్రమే కాకుండా తన ప్రేమ వ్యవహారాల వల్ల కూడా ఎప్పుడూ వార్తలలో ఉండేది.
అటు స్టార్స్.. ఇటు క్రికెటర్స్ తో ప్రేమలో ఉందనే రూమర్స్ ఎక్కువగానే వినిపించాయి. దీంతో అవకాశాలు తగ్గిపోయి సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. 2017లో తన ప్రియుడు శివమ్ తివారిని బెంగాలీ సంప్రదాయల ప్రకారం రహస్యంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రియా సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
