Tollywood : ఇంట్లో నుంచి 300లతో పారిపోయిన కుర్రాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరో.. ఒక్కో సినిమాతో బాక్సాఫీస్ షేక్..

కేవలం 300 రూపాయలతో ఇంట్లో నుంచి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చినా ఒక కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. నటుడిగా తెరపై ఓ వెలుగు వెలగాలని.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని.. ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందామా..

Tollywood : ఇంట్లో నుంచి 300లతో పారిపోయిన కుర్రాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరో.. ఒక్కో సినిమాతో బాక్సాఫీస్ షేక్..
Yash Childhood

Updated on: Jul 04, 2026 | 7:27 AM

సాధారణంగా సినీరంగంలో ఎప్పుడు ఎవరి జీవితం మలుపులు తిరుగుతుందో చెప్పలేము. అలాగే ఒక్క సినిమా మరొకరి లైఫ్ మార్చేస్తుందనేది సైతం ఊహించలేము. అలాంటి ఒక మూవీ.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసింది. దీంతో ఆ నటుడి జీవితం మారిపోయింది. కేవలం రూ.300లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పుడు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన అతను, తన కలలను సాకారం చేసుకోవడానికి చేసిన ప్రయాణం నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. కానీ అతడు ప్రపంచవ్యా్ప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. అతడి తండ్రి ఇంకా ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు మరెవరో కాదు.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జన్మించిన యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. అతని తండ్రి బస్ డ్రైవర్‌గా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న యశ్.. 300 రూపాయలతో బెంగళూరు వెళ్ళాడు. అతను ఒక నాటక బృందంలో చేరి నటన మెళకువలు నేర్చుకున్నాడు. రంగస్థల ప్రదర్శనల ద్వారా అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు.

అదే సమయంలో నెమ్మదిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అతను ‘నంద గోకుల’ వంటి అనేక టెలివిజన్ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. టెలివిజన్‌లో అతనికి లభించిన గుర్తింపు కన్నడ చిత్ర పరిశ్రమలో యశ్‌కు అవకాశాలు అందించింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన అతను, 2008లో వచ్చిన ‘మొక్కిన మనసు’ చిత్రంతో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ‘రాకీ’, ‘మొదలసాల’, ‘రాజధాని’, ‘డ్రామా’, ‘కూక్లి’ వంటి సినిమాల్లో హీరోగా కనిపించాడు. కానీ అతడి కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ రామచారి’.

అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా యష్ జీవితాన్ని మార్చేసింది. . 2018లో విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దీంతో ఇప్పుడు యశ్ .. పాన్ ఇండియా స్టార్ హీరో. ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు రూ.130 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. ప్రస్తుతం టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

యశ్ ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us