Pushpa Movie: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆ మాటకొస్తే యావత్ దేశ వ్యాప్తంగా పుష్ప మేనియా కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరికాసేపట్లే థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై ఆకాశనంటేలా అంచనాలున్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది. ఈ మాస్ బీట్‌కు ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ లిరికల్ వీడియో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే ఈ పాటలో ఉన్న చరనాలు మగవారిని అగౌరవ పరిచేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పాటను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదం ఇంకా ముగిసిపోకముందే మరో వివాదం చుట్టుముట్టింది. తమిళనాడులోనూ ఈ పాటకు వ్యతిరేకత వస్తోంది. తమిళంలో ‘ఓ సొల్‌రియా’ చరణంతో వచ్చే ఈ పాట.. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే 20 మిలియన్ పైగా వ్యూస్‌తో దూసుకుపోతోందీ పాట. అయితే ఈ పాటలో ఉన్న పదాలు పురుషులను కించపరిచేలా ఉందని పాటను బ్యాన్ చేయాలంటూ తమిళనాడులోని పురుషుల సంఘం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించింది. ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రచించగా, తమిళంలో గేయరచయిత వివేకా రాశారు.
Also Read: Mosquito Coil: ఇంట్లో దోమల కాయిల్స్ వెలిగిస్తున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..
Shocking News: భర్త నచ్చలేదని అర్ధరాత్రి దురాగతం.. సలసల మరిగే నూనెతో భార్య ఏం చేసిందంటే..?
ట్రెక్కింగ్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి తెలుసా..