Tollywood: శ్రీదేవితో జోడీకి ‘నో’ చెప్పిన టాలీవుడ్​ స్టార్​ హీరో.. కారణమేంటో తెలుసా?

80, 90లలో టాలీవుడ్‌లో శ్రీదేవి పేరు వినగానే ప్రొడ్యూసర్లు డేట్స్ బుక్ చేసుకునేందుకు పరుగులు పెట్టేవారు. ఆమెతో ఒక్క సినిమా అంటే ఆటోమాటిక్‌గా ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా పెరిగిపోయేది. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున… ఎవరైనా ఆమె సరసన ..

Tollywood: శ్రీదేవితో జోడీకి ‘నో’ చెప్పిన టాలీవుడ్​ స్టార్​ హీరో.. కారణమేంటో తెలుసా?
Sridevi

Updated on: Nov 19, 2025 | 12:33 PM

80, 90లలో టాలీవుడ్‌లో శ్రీదేవి పేరు వినగానే ప్రొడ్యూసర్లు డేట్స్ బుక్ చేసుకునేందుకు పరుగులు పెట్టేవారు. ఆమెతో ఒక్క సినిమా అంటే ఆటోమాటిక్‌గా ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా పెరిగిపోయేది. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున… ఎవరైనా ఆమె సరసన నటించే అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూసేవారు. ఒక్క డాన్స్, ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తోనే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది. ఆ కాలంలో శ్రీదేవితో జోడీ కట్టడం అంటే హీరోకి గ్యారంటీ స్టార్‌డమ్, ప్రొడ్యూసర్‌కి కాసుల పంటగా ఉండేది.

అయితే… ఇలాంటి గోల్డెన్ ఆఫర్‌ని చాలాసార్లు వచ్చినా, గట్టిగా ‘వద్దు’ అని చెప్పేసిన ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు. ఆయనతో శ్రీదేవి హీరోయిన్‌గా నటించే సినిమాలు రెండు మూడు సార్లు ప్లాన్ అయ్యాయి. ప్రముఖ దర్శకులు, టాప్ బ్యానర్ల నుంచి ఆఫర్లు వచ్చాయి. కథలు రెడీ, డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ అయ్యాయి. కానీ ప్రతిసారీ ఆ హీరో మాత్రం సున్నితంగా ‘నేను ఒప్పుకోలేను’ అని తిరస్కరించేవారట. ఆ రోజుల్లో ఇది ఇండస్ట్రీలో బిగ్ టాక్. ‘అంత మంచి అవకాశం వదులుకున్న హీరో ఎవరు?’ అని అందరూ ఆశ్చర్యపోయారు.

ఎందుకు తిరస్కరించారు?

ఆ హీరోకి శ్రీదేవి అంటే గౌరవం ఎక్కువ, ఆమెని తల్లి స్థానంలో చూసేవారట. ఆయన ఎవరో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆ రోజుల్లో శ్రీదేవి ఆయన తండ్రి ఎన్టీఆర్​తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో శ్రీదేవి ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా కనిపించేది కాబట్టి, ఆయన కొడుకుగా ఆమె సరసన రొమాన్స్ చేయడం సరిపోదని ఆయన భావించారు.

Sridevi & Balakrishna1

ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు, సినీ దిగ్గజాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య బాబు ఎప్పుడూ తన సిద్ధాంతాలకి కట్టుబడి నడిచిన వ్యక్తి. శ్రీదేవితో జోడీ కట్టడం ఎంతటి భారీ ఆఫర్ అయినా, తండ్రి అనుబంధం, సంప్రదాయ గౌరవం కోసం ఆయన ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇది నందమూరి వారసత్వంలో మరో అపూర్వ ఘట్టం. ఈ రోజు కూడా ఈ విషయం గుర్తు చేసుకుంటే…  ‘అబ్బో, బాలయ్య-శ్రీదేవి జోడీ ఒక్కసారైనా కనిపిస్తే ఎలా ఉండేదో’ అనిపిస్తుంది కదా? కానీ బాలకృష్ణ మాత్రం ఎప్పటికీ రాజీపడని తన స్టాండ్‌తో సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.