Thankyou Movie: ‘కలలా కదిలిందే నువ్వు చేసిన అందమైన గాయం’.. మెస్మరైజ్ చేస్తోన్న థ్యాంక్యూ టైటిల్‌ సాంగ్‌ లిరిక్స్‌..

Thankyou Movie: నాగచైతన్య (Nagachaitanya) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం థ్యాంక్యూ. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మంచి లవ్‌ ఎమోషన్స్‌తో...

Thankyou Movie: కలలా కదిలిందే నువ్వు చేసిన అందమైన గాయం.. మెస్మరైజ్ చేస్తోన్న థ్యాంక్యూ టైటిల్‌ సాంగ్‌ లిరిక్స్‌..

Updated on: Jul 18, 2022 | 6:10 AM

Thankyou Movie: నాగచైతన్య (Nagachaitanya) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం థ్యాంక్యూ. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మంచి లవ్‌ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా జులై 22న విడుదల చేయనున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్ ఇందులో చైతన్యకు జోడిగా నటిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ సినిమాపై మంచి బజ్‌ను తెచ్చాయి. ఫీల్‌గుడ్‌ మూవీగా వస్తోన్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో మరో కీలక సినిమాగా మారుతుందని మేకర్స్‌ ధీమాగా ఉన్నారు.

ఇక సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా థ్యాంక్యూ టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ‘కలలా కరిగిందే నువ్వు చేసిన అందమైన గాయం’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వనమాలి రాసిన లిరిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఇక కార్తీక్‌ అలపించిన తీరుకూడా మెస్మరైజ్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ పాటకు తమన్‌ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 9 నిమిషాలకు లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. లవ్‌స్టోరీ, బంగార్రాజు వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ తర్వాత థ్యాంక్యూ మూవీతో వస్తోన్న నాగ చైతన్య తన ఖాతాలో హ్యాట్రిక్‌ విజయాన్ని వేసుకుంటారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..