Jana Nayagan: ఇదీ దళపతి విజయ్ రేంజ్..! రిలీజ్‌కు ముందే రూ.400 కోట్లు..

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్టు దళపతి విజయ్ ప్రకటించారు. తాను నటించే చివరి సినిమా జన నాయగన్ అని చెప్పేశారు. దీంతో ఆ సినిమాకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయాల్లో పూర్తిగా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్, ఈ సినిమా తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని

Jana Nayagan: ఇదీ దళపతి విజయ్ రేంజ్..! రిలీజ్‌కు ముందే రూ.400 కోట్లు..
Thalapathy Vijay

Edited By: Janardhan Veluru

Updated on: Nov 14, 2025 | 12:28 PM

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్టు దళపతి విజయ్ ప్రకటించారు. తాను నటించే చివరి సినిమా జన నాయగన్ అని చెప్పేశారు. దీంతో ఆ సినిమాకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయాల్లో పూర్తిగా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్, ఈ సినిమా తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 2026 జనవరి 9న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలోకి రానుంది.

సినిమా ప్రకటనతోనే హైప్ క్రియేట్ చేసిన జన నాయగన్, రిలీజ్‌కు ముందే భారీ ప్రీ-బిజినెస్ చేసేస్తోంది. ఇప్పటివరకు రూ.338 కోట్లు బిజినెస్ చేసిందని టాక్. తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులకు రూ.115 కోట్లు, ఓవర్సీస్ రైట్స్‌ రూ.78 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

OTT రైట్స్‌లో రికార్డు..

జన నాయగన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.110 కోట్లకు కొనుగోలు చేసింది. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి ముందుకు వచ్చింది ప్రైమ్.

కాగా, రజినీకాంత్ నటించిన కూలి OTT హక్కులు రూ.100-110 కోట్లకు అమ్ముడయ్యాయి. అయితే, జన నాయగన్ రూ.110-115 కోట్లకు సేల్ అయ్యిందట. విజయ్ లాస్ట్ ఫిల్మ్ కావడంతో మాస్‌లో ఆయనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ మొత్తాన్ని చెల్లించి సినిమా రైట్స్‌ను కొనుగోలు చేశారని సినీ వర్గాల టాక్.

Coolie

ఆడియో హక్కుల కోసం కూడా టీ-సిరీస్ భారీ మొత్తం చెల్లించింది. శాటిలైట్ హక్కులు, మిగిలిన ప్రాంతీయ థియేట్రికల్ హక్కులు లెక్కిస్తే జన నాయగన్ ప్రీ-బిజినెస్ రూ.400 కోట్లు దాటే చాన్స్‌ ఉంది.

మరోసారి మ్యాజిక్!

మాస్ ఎంటర్‌టైనర్లలో విజయ్ ఎప్పుడూ అభిమానులను అలరిస్తుంటారు. జన నాయగన్ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నారాయణ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో విజయ్ నటిస్తున్న చివరి సినిమా అని ప్రకటించడంతో ఆయన అభిమానులతోపాటు సినీ ప్రియులంతా జన నాయగన్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

దళపతి విజయ్ స్టార్ డమ్, ప్రీ బిజినెస్ లెక్కలు చూస్తుంటే పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న జన నాయగన్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులను క్రియేట్ చేయనుందని అభిమానులు భావిస్తున్నారు. వారి ఆశలకు ప్రీ రిలీజ్ బిజినెస్ మరింతగా బలం చేకూర్చుతోంది.