డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల నుంచి తెలుగు సినిమాలకు ఊరట

|

Mar 20, 2019 | 5:12 PM

ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కువైపోయింది. ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వెళ్లడం కన్నా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారానే సినిమా చూడడం పై ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు సినిమా ఇంకా థియేటర్ లో ఉండగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు. దీనితో సినిమా వసూళ్ల మీద చాలా నష్టం ఏర్పడుతోంది. తాజాగా తెలుగు సినిమాలకు వీటి నుంచి పెద్ద సమస్య తప్పిందనే చెప్పాలి. నిర్మాతల మండలి తీసుకున్న తాజా నిర్ణయం […]

డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల నుంచి తెలుగు సినిమాలకు ఊరట
Follow us on

ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కువైపోయింది. ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వెళ్లడం కన్నా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారానే సినిమా చూడడం పై ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు సినిమా ఇంకా థియేటర్ లో ఉండగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు. దీనితో సినిమా వసూళ్ల మీద చాలా నష్టం ఏర్పడుతోంది.

తాజాగా తెలుగు సినిమాలకు వీటి నుంచి పెద్ద సమస్య తప్పిందనే చెప్పాలి. నిర్మాతల మండలి తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఇకపై సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. కాగా ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. దీని మూలంగా తెలుగు సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ నుంచి పెద్ద ముప్పు తప్పిందని చెప్పాలి.