Allu Arjun: ఓటీటీలోకి ఐకాన్‌ స్టార్‌ ఎంట్రీ.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్ ఇచ్చిన ఆహా.

తొలి తెలుగు ఓటీటీ ఆహా రోజురోజుకీ ప్రేక్షకులు ఆదరణ పొందుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో పాటు మరే ఓటీటీలో లేని టాక్‌ షోలతో ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పటికే బాలకృష్ణతో..

Allu Arjun: ఓటీటీలోకి ఐకాన్‌ స్టార్‌ ఎంట్రీ.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్ ఇచ్చిన ఆహా.
Aha

Updated on: Mar 16, 2023 | 8:22 AM

తొలి తెలుగు ఓటీటీ ఆహా రోజురోజుకీ ప్రేక్షకులు ఆదరణ పొందుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో పాటు మరే ఓటీటీలో లేని టాక్‌ షోలతో ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పటికే బాలకృష్ణతో నిర్వహించిన అన్‌స్టాపబుల్‌ టాక్‌ రికార్డులను తిరగరాసింది. ఈ టాక్‌ షోకు రికార్డు స్థాయిలో వ్యూస్‌ ఇచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆహా నిర్వహకులు మరేదో పెద్దగా ప్లానింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆహా చేసిన ఓ ట్వీట్‌ ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇంతకీ విషయమేంటంటే.. ఆహా ఓటీటీకి అల్లు అర్జున్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బన్నీతో ఆహా ఏదో ప్రోగ్రామ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ ఫొటోపై కమ్మింగ్ సూన్‌ అని రాసున్న ఓ పోస్టర్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ని మీరు మాస్‌గా, క్లాస్‌గా చూసి ఉంటారు. ఈసారి ఒక బ్లాక్ బస్టర్ లుక్‌తో ఆహా మీ ముందు తీసుకురాబోతోంది.. ‘ది బిగ్గెస్ట్’ అనౌన్స్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండండి! ఎనీ గెస్సెస్?’ అంటూ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

దీంతో బన్నీతో చేయనున్న కొత్త ప్రోగ్రామ్‌ ఎంటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆహా కోసం అల్లు అర్జున్‌ కొత్త యాడ్‌ చేస్తున్నాడని కొందరు, కాదు కాదు.. బాలకృష్ణ తరహా ఏదో టాక్‌ షో ప్లాన్‌ చేస్తున్నారని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ సస్పెన్స్‌కు తెర పడాలంటే ఆహా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..