Anjali: 2006లో వచ్చిన ఫొటో చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది తెలుగమ్మాయి అంజలి. తొలి సినిమాతో తన న్యాచురల్ నటతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోయింది. చాలా కాలం పాటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్న అంజలి మళ్లీ 2012లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమాతో అంజలి తెలుగులో మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారింది.
వరుస ఆవకాశాలు సొంతం చేసుకుంటూ తెలుగుతో పాటు, తమిళంలోనూ నటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటెం సాంగ్‌లో నటించి కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఇక తాజాగా రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాలో అంజలీ విలన్ పాత్రలో నటించనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపే అంజలి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తి, సినీ కెరీర్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది అంజలి. సంతోషంగా గంతులేస్తోన్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్ చేసిన అంజలి.. ‘జీవితంలో చిన్న చిన్న విషయాలకు సంతోషపడాలి’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..