World Famous Lover : సైడై సేఫైయిపోయిన నాని

|

Feb 16, 2020 | 8:41 PM

World Famous Lover :  హీరో క్యారెక్టర్‌కి కాస్త రెబలిస్టిక్ నేచర్‌ని యాడ్ చేసిన ప్రేమ కథల్లో విజయ దేవరకొండ ఎక్కువగా కనిపించాడు. అవి అతడికి మంచి ఇమేజ్‌ కూడా తెచ్చిపెట్టాయి. ఇక ఇదే లాస్ట్ లవ్ స్టోరీ సినిమా అంటూ ఓ నాలుగు ప్రేమ కథలు నిండిన ఓ సబ్జెక్ట్‌తో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ ప్రేక్షకుల మందుకు వచ్చాడు రౌడీ హీరో. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరున్న క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో మూవీపై […]

World Famous Lover : సైడై సేఫైయిపోయిన నాని
Follow us on

World Famous Lover :  హీరో క్యారెక్టర్‌కి కాస్త రెబలిస్టిక్ నేచర్‌ని యాడ్ చేసిన ప్రేమ కథల్లో విజయ దేవరకొండ ఎక్కువగా కనిపించాడు. అవి అతడికి మంచి ఇమేజ్‌ కూడా తెచ్చిపెట్టాయి. ఇక ఇదే లాస్ట్ లవ్ స్టోరీ సినిమా అంటూ ఓ నాలుగు ప్రేమ కథలు నిండిన ఓ సబ్జెక్ట్‌తో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ ప్రేక్షకుల మందుకు వచ్చాడు రౌడీ హీరో. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరున్న క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్‌కు వన్ వీక్ నుంచి  దేవరకొండ ప్రమోషన్స్‌తో దుమ్ము రేపాడు. అయితే ఈ శుక్రవారం రిలీజైన ఈ మూవీకి అనూహ్యంగా డివైడ్ టాక్ వచ్చింది. మార్నింగ్ షో నుంచి రిపోర్ట్స్ నెగటీవ్‌గా అందాయి. విజయ్ రేంజ్‌కి తగ్గ అంశాలు మూవీలో లేవని ఫ్యాన్స్‌ డిసప్పాయింట్ అయ్యారు. మరి ఇదే కథ ఇంకో హీరో చేస్తే హిట్ కొట్టేదా అన్న అనుమానాలు వ్యక్తమవగానే ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.

ఈ కథని క్రాంతి మాధవ్ రాసిందే న్యాచురల్ స్టార్ నాని కోసమట. అయితే ఇటీవలే విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌‌లో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా చేశాడు నాని. అందులో కూడా తన పాత్ర రైటరే అవ్వడంతో..నాని సైడైపోయాడట. ఆ తర్వాత సాయి తేజ్, శర్వానంద్ కూడా ఈ స్క్రిప్ట్‌ను సున్నితంగా తిరస్కరించారట. దీంతో స్టోరీ విజయ్ దేవరకొండ వద్ద వచ్చింది. ఢిపరెంట్ లవ్ స్టోరీ అవ్వడం, నాలుగైదు పాత్రల్లో నటించే అవకాశం ఉండటంతో రౌడీ హీరో ఓకే చెప్పేశాడట. ఇలా మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఫస్ట్ హాఫ్‌లో ఇల్లందు మైనింగ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీకి మంచి ప్రశంసలు లభించినా, సెకండ్ హాఫ్ తేడా వచ్చేసింది. అయితే సినిమాలు అక్కడక్కడ మంచి సన్నివేశాలు రాసుకున్నాడు క్రాంతి మాధవ్. కానీ కొన్ని పాత్రలకు అవుట్ లైన్ ఇవ్వడంతో ఏదో వెలితి అనిపించింది. మొత్తంగా ఈ సినిమా 30 కోట్లు కలెక్ట్ చేస్తేనే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. కానీ కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా లేవు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

ఇది కూడా చదవండి : త్రివిక్ర‌మ్‌కి షాక్..! అల కథ కాపీ అంటూ యువ రచయిత ఫైర్..