
బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి కప్పు గెలిచాడు కళ్యాణ్ పడాల. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో జై జవాన్ కళ్యాణ్ పేరు మారుమోగుతుంది. వేలాది మంది అప్లికేషన్స్ దాటుకుని అగ్నిపరీక్షకు ఎంపికయ్యాడు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కళ్యాణ్ పడాలకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. కానీ ఇంట్లో పరిస్థితులు.. తల్లిదండ్రుల కోసం చదువు పూర్తి చేసి ఆర్మీలో సెలక్ట్ అయ్యాడు. సీఆర్పీఎఫ్ జవాన్ గా మూడేళ్లు ఆర్మీలో సేవలు అందించాడు. కానీ నటుడు కావాలనే ఇష్టాన్ని మాత్రం వదులుకోలేకపోయాడు. అందుకే అటు జవాన్ గా దేశానికి సేవలందిస్తూనే.. మరోవైపు మంచి అవకాశం కోసం ఎదురుచూశాడు. బిగ్ బాస్ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా తనవంతు ప్రయత్నం చేశాడు. ఈసారి సీజన్ 9 కోసం నిర్వాహకులు చేపట్టిన అగ్నిపరీక్ష షోలోకి వేలాది మందిని దాటుకుని ఎంటర్ అయ్యాడు.
అగ్నిపరీక్షలో తన ఆట తీరుతో ఆకట్టుకుని ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు. మొదటి రెండు మూడు వారాలు తన ఆట తీరుతో జనాలకు విసుగు పుట్టించాడు. ముఖ్యంగా తనూజ చుట్టూ తిరగడంతో అతడిపై ఎక్కువగానే నెగిటివిటీ వచ్చింది. కానీ శ్రీజ, ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత తన ఆట తీరులో మార్పు వచ్చింది. నాలుగో వారం నుంచి టాస్కులలో ఇరగదీశాడు. అలాగే జెన్యూన్ గా ఉంటూ తన మాట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆర్మీ జవాన్ అయినా.. ఎప్పుడూ తన వృత్తి గురించి కానీ.. తన ఫ్యామిలీ పరిస్థితుల గురించి మాట్లాడుకుండా.. జెన్యూన్ గా తన గేమ్ పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. నాలుగో వారం నుంచి రోజు రోజుకీ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు కళ్యాణ్.
ఫ్యామిలీ వీక్ సమయంలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్న తీరు ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి కనెక్ట్ అయ్యింది. పేరెంట్స్ తో ఎంతో సంతోషంగా గడపాలనుకున్న ప్రతి అబ్బాయి.. ఆర్థిక, కుటుంబ సమస్యలతో ఎంతగా నలిగిపోతుంటాడో కళ్లకు కట్టినట్లు చెప్పాడు కళ్యాణ్. అతడి ప్యూర్ ఎమోషన్స్ అతడిని జనాలకు మరింత దగ్గర చేశాయి. ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ పడాల గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా ఊహించని ఓటింగ్ తో టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
ప్రతి టాస్కులో ఇరగదీశాడు. చివరి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి.. ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ వరకు ప్రతి రోజూ తన ఆట తీరుతో చరిత్ర సృష్టించాడు. ఎవరిని తగ్గించకుండా.. ఎవరిని వెన్నుపోటు పొడవకుండా జెన్యూన్ ప్లేయర్ గా ఆడుతూ అడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు. టాస్కులలో కళ్యాణ్ చూపించిన ప్రతిభ, తెగువపై నాగార్జున సైతం ప్రశంసించారు. ఎదుటివారు కించపరిచినా.. తన వ్యక్తిత్వం గురించి తప్పుగా మాట్లాడినా సహనం కోల్పోకుండా పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడడం… ఎవరిపై పర్సనల్ అటాక్ చేయకుండా ఉండడం అతడిలోని నాయకత్వ లక్షణాలను చాటిచెప్పింది. ప్రతి కఠిన పరిస్థితులలో కళ్యాణ్ ప్రవర్తించిన తీరు.. హుందాతనం అతడిని విజేతగా నిలబెట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టి సీజన్ 9 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు కళ్యాణ్. సెలబ్రెటీలే కాదు.. నిజాయితీగా ఆడితే సామాన్యులు కూడా బిగ్ బాస్ కింగ్ అవుతారని నిరూపించాడు కళ్యాణ్. బిగ్ బాస్ హిస్టరీలోనే ఎలాంటి రిమార్క్ లేకుండా కప్పు కొట్టిన సామాన్యుడిగా నిలిచాడు కళ్యాణ్.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బిగ్బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?