స్టైలిష్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల ‘వార్’..!

|

Dec 04, 2019 | 11:51 AM

ఒకే ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఎల్లప్పుడూ వార్ జరుగుతుండటం కామన్. వ్యూస్, కలెక్షన్స్, లేదా బాక్స్ ఆఫీస్ రికార్డులు.. ఇలా టాపిక్ ఏదైనా సోషల్ మీడియా వేదికగా ఇద్దరి హీరోల అభిమానులు మాటల యుద్దానికి దిగుతారు. ఇక తాజాగా ఇదే కోవలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య గొడవలు షురూ అయ్యాయి. ఈ ఇద్దరు హీరోలు వచ్చే ఏడాది తమ సినిమాలతో సంక్రాంతి బాక్స్ ఆఫీస్‌ […]

స్టైలిష్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల వార్..!
Follow us on

ఒకే ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఎల్లప్పుడూ వార్ జరుగుతుండటం కామన్. వ్యూస్, కలెక్షన్స్, లేదా బాక్స్ ఆఫీస్ రికార్డులు.. ఇలా టాపిక్ ఏదైనా సోషల్ మీడియా వేదికగా ఇద్దరి హీరోల అభిమానులు మాటల యుద్దానికి దిగుతారు. ఇక తాజాగా ఇదే కోవలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య గొడవలు షురూ అయ్యాయి.

ఈ ఇద్దరు హీరోలు వచ్చే ఏడాది తమ సినిమాలతో సంక్రాంతి బాక్స్ ఆఫీస్‌ వద్ద అమీతుమీ తేల్చుకోనున్నారు. ‘అల వైకుంఠపురంలో’ అంటూ అల్లు అర్జున్ పలకరిస్తుండగా.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’తో వస్తున్నాడు. రెండూ కూడా డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్. ఇదిలా ఉండగా ‘సామజవరగమనా’, ‘రాములో రాముల’ లిరికల్ సాంగ్స్ బన్నీ మూవీ నుంచి విడుదలై పెద్ద చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. అటు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ టీజర్, ‘మైండ్ బ్లాంక్’ టీజర్లకు కూడా అదిరిపోయే వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వ్యూస్ దగ్గరే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగింది. ‘మా హీరోనే గొప్ప’ అంటే.. ‘మా హీరోనే గొప్పా’ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దానికి దిగారు.

మరోవైపు  ‘మైండ్ బ్లాంక్’ వీడియోకు 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ రావడంతో.. ఆన్లైన్ ద్వారా తెరచాటు మంత్రాంగం చేశారని స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం 24 గంటల్లో ‘మైండ్ బ్లాంక్’ వీడియోకు 7.8 మిలియన్ వ్యూస్ రాగా.. ‘రాములో రాముల’కు 7.3 మిలియన్.. ‘సామజవరగమనా’కు 5.1 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఏది ఏమైనా టీజర్లతో మొదలైన ఈ గొడవ.. సినిమా రిలీజ్ అయ్యి.. కలెక్షన్స్ రికార్డుల వరకు వెళ్లేలా కనిపిస్తోంది.