
బుల్లితెర నటి.. బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తన ప్రియుడు హీరో విజయ్ కార్తిక్ తో విడిపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు.. రెండేళ్ల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు షోలలో పాల్గొన్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా విడిపోయినట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది కీర్తి. విజయ్ కార్తిక్ ను తాను భర్తగా చూడలేకపోతున్నాని.. తమ బంధాన్ని ఇకపై స్నేహంగా కొనసాగిస్తామని అన్నారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో వరుస పోస్టులు చేసింది కీర్తి. దీంత వీరిద్దరి బ్రేకప్ పై నెట్టింట చర్చ జరగ్గా.. కీర్తి ఫ్యాన్స్ ఇద్దరూ కలిసుండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తమ బ్రేకప్ పై కీర్తి మాజీ ప్రియుడు విజయ్ కార్తీక్ స్పందించారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..
తాను కీర్తిని వదిలేయలేదని.. తననే ఆమె వదిలేసిందని అన్నారు. ఆర్థికంగా స్థిరపడలేదనే కారణంతోనే తాను బ్రేకప్ చెప్పిందని అన్నారు. తాను కీర్తిని వదిలేయాలని అస్సలు అనుకోలేదని అన్నారు. కీర్తి పోస్ట్ చేసిన తర్వాత తనకు చాలా మేసేజ్ లు వస్తున్నాయని.. ఫోన్స్ చేస్తున్నారని అన్నారు. కీర్తిని వదిలేయకండి అని మెసేజ్ లు వస్తున్నాయని.. కానీ ఇద్దరీ అంగీకారంతోనే విడిపోతున్నట్లు కీర్తి పోస్ట్ చేయడంతో నాకు కాల్స్ చేస్తున్నారని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
విడిపోవడం అనేది కేవలం కీర్తి నిర్ణయమే అని.. కీర్తితో పెళ్లి అని తన కుటుంబం కూడా కోరుకుందని చెప్పుకొచ్చారు. తను డిసెంబర్‌లోనే ఈ మాట చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించిందని.. ఆమె జీవితం.. ఆమె నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదని.. చాలా వరకు ఆమెను కన్విన్స్ చేసినప్పటికీ.. కేవలం డబ్బులు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశానని అన్నారు. ప్రస్తుతం విజయ్ కార్తీక్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..
ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..