Anaganaga Oka Ooru: Tv9 పై పల్లెవాసుల ప్రేమకు..గ్రామీణుల్లో tv9 పై చెక్కుచెదరని నమ్మకానికి.. అభిమానానికి నిదర్శనం ఈ దృశ్యాలు. జనమంతా ప్రభంజనంగా వెళ్లి టీవీ చూడటం అనేది 30 ఏళ్ల క్రితం గ్రామాలలో కనిపించిన ముచ్చట! నిజానికి ఇంతమంది కలిసి టీవీ చూడటానికి ఇదేం క్రికెట్ మ్యాచ్ (Cricket Match) కాదు. ఎన్నికల ఫలితాలు (Election Results) అంతకంటే కాదు. ఈ పల్లె వాసులు పరవశంగా చూస్తున్నది.. ప్రతి ఆదివారం tv9 లో ప్రసారమయ్యే ‘అనగనగా ఒక ఊరు’ కార్యక్రమం. అవును మీ ఊరైనా..మా ఊరైనా.. పల్లె అంటేనే భారత దేశపు ఆత్మ. ఆ పల్లె ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నమే.. టీవీ 9 తెలుగు ‘అనగనగా ఒక ఊరు’. దశాబ్దాలుగా విస్మరణకు గురైన గ్రామాలు.. కనీస సౌకర్యాలకు నోచుకోని పల్లెల గోస వినిపించే కార్యక్రమం ‘అనగనగా ఒక ఊరు’. పల్లెవాసుల సమస్యలతో బాటు.. సామాన్య మట్టి మనుషులు సాధిస్తున్న అసాధారణ విజయాలను ప్రపంచం ముందుకు తీసుకొస్తుంది టీవీ 9-అనగనగా ఒక ఊరు. ఈ ప్రయత్నంలో భాగాంగానే చిత్తూరు జిల్లా మహిళా పాడి రైతులు సృష్టించిన క్షీర విప్లవాన్ని ‘అనగనగా ఒక ఊరు’ లో ప్రసారం చేసింది టీవీ9.
సంఘాలు కలిసి సమూహాలుగా..సమూహాలు కలిసి.. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా డెయిరీలో భాగస్వాములైన వైనాన్ని tv9 వివరించింది. NDDB ఆధ్వర్యంలో నడుస్తున్న దేశంలోనే తొలి మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీలో లక్షమందికి పైగా సభ్యులు ఉండటం విశేషం. అంతేకాదు ఆ సంస్థకు సభ్యులే యజమానులు కావడం స్ఫూర్తిని నింపుతుంది. సాధికారతకు నిదర్శనంగా నిలిచిన చిత్తూరు మహిళల విజయగాథపై tv9 ‘అనగా ఒక ఊరు’ కథనానికి విశేష స్పందన లభించింది. పల్లెల్లో పాల వెల్లువకు దృశ్యరూపం ఇచ్చిన ‘అనగనగా ఒక ఊరు’ చూడటానికి ఊర్లన్నీ ఏకమయ్యాయి. రైతులంతా ఒక చోట చేరి tv9 వీక్షించారు. చిత్తూరు మహిళా రైతులు స్పెషల్ స్క్రీన్ లు ఏర్పాటు చేసుకుని మరీ ‘అనగనగా ఒక ఊరు’ కార్యక్రమం వీక్షించారు. తమ గుండెకు గొంతుకై..తమ బతుకులకు దృశ్యమైన Tv9 పై ఇలా తమ ప్రేమను కురిపించారు జిల్లా వాసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..