
ప్రముఖ బుల్లితెర నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ సీరియల్స్, షోలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఆమె బాగా సుపరిచితురాలైంది. ఓవైపు స్మాల్‌స్ర్కీన్‌పై సందడి చేస్తూనే మరోవైపు తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెల్త్, లైఫ్‌స్టైల్ టిప్స్‌ను ఫ్యాన్స్‌కు అందిస్తూ ఉంటుంది. ఇలా సందర్భమేదైనా మాటల ప్రవాహంతో సందడి చేసే శ్రీవాణి గొంతు సడెన్‌గా సైలెంట్ అయిపోయింది. గత నెలలో ఆమె ఓ అరుదైన వ్యాధి బారిన పడింది. దీని కారణంగా ఆమె గొంతు తాత్కాలికంగా మూగబోయింది. కొంచెం గట్టిగా మాట్లాడినా ఆమె గొంతు శాశ్వతంగా మూగబోతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో నెలరోజుల నుంచి ఒక్కమాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తాజాగా ఈ నటి గొంతు మళ్లీ మాట్లాడుతోంది. ఇందుకోసం ఆమె తీసుకున్న చికిత్స విజయవంతమైంది.
ఈ శుభవార్తను స్వయంగా శ్రీవాణి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో చెప్పుకొచ్చింది. వైద్యుల సూచన మేరకు జూలై 19 నుంచి ఆగస్టు 19 వరకు అస్సలు ఒక్కమాట మాట్లాడలేదు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కాలం గడిపాను. ఈ సమయంలో నాకోసం ఎంతోమంది ప్రార్థించారు. వారందరికీ కృతజ్ఞతలు అని శ్రీవాణి చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వెల్‌కమ్ బ్యాక్ మేడమ్’, ‘మీ వాయిస్ వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..