
గతవారం రోజులుగా పవిత్ర జయరామ్ పేరు వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. ఇటీవల కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్ నగర్ హైవే పై జరిగిన కారు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందగా.. ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో నటుడు చంద్రకాంత్ గాయాలయ్యాయి. అయితే పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రకాంత్ కొన్ని రోజులుగా మానసిక క్షోభను అనుభవించాడు. పవిత్రతో ఉన్న జ్ఞాపకాలను, ఫోటోస్, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పవిత్ర లేకుండా తాను ఉండలేకపోతున్నానని బాధపడ్డాడు. పవిత్ర పుట్టినరోజు అంటూ పోస్ట్ చేస్తూ రెండు రోజులు ఆగు.. వచ్చేస్తున్నా అంటూ రాసుకొచ్చాడు. ఆ మరుసటి రోజే తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రకాంత్ మరణంతో అప్పటివరకు ఎవరికీ తెలియని ఆయన కుటుంబం తెరపైకి వచ్చింది. అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్న చంద్రకాంత్.. పవిత్ర జయరామ్‌తో సహజీవనం చేస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి.
త్రినయని సీరియల్ ద్వారా ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక పవిత్ర పరిచయమైన తర్వాత తన జీవితం నాశనమయ్యిందని.. తమ మధ్య విభేధాలు వచ్చాయని చంద్రకాంత్ భార్య వాపోయింది. ఇప్పుడు పవిత్ర జయరామ్, చంద్రకాంత్, ప్రేమ, పెళ్లి, సహజీవనం గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలో తన తల్లి గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఎమోషనల్ అయ్యింది పవిత్ర జయరామ్ కూతురు ప్రతీక్ష. తన తల్లి పవిత్ర, చంద్రకాంత్ గురించి తప్పుగా మాట్లాడవద్దని.. ఇద్దరు మంచి స్నేహితులను తెలిపింది.
చంద్రకాంత్ మంచి వ్యక్తి అని.. తనతో కూడూ ఫోన్లో మాట్లాడేవాడని..తనను బాగా చదువుకోవాలని ఎంకరేజ్ చేసేవాడని చెప్పుకొచ్చింది. తన తల్లి అంత్యక్రియలకు చంద్రకాంత్ హాజరయ్యాడని తెలిపింది. ఇక పవిత్ర జయరామ్ కుమారుడు ప్రజ్వల్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోకి ప్రతి ఒక్కరి గురించి ఏదోక గాసిప్ వినిపిస్తుందని.. అలాగే ఇప్పుడు తన తల్లి గురించి రూమర్స్ వస్తున్నాయని అన్నారు. తన తల్లి, చంద్రకాంత్ మంచి స్నేహితులను.. పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో మాత్రమే చూశానని.. కానీ ఆ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని అన్నాడు. కర్ణాటకలోనే మండ్యలో పవిత్ర జయరామ్ అంత్యక్రియలు నిర్వహించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.