Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ సింగర్‌.. టైటిల్‌ నాదే అంటూ నెట్టింట్లో పోస్ట్‌

|

Sep 03, 2022 | 5:02 PM

Bigg Boss Season 6 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్‌-6 మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఆదివారం (సెప్టెంబర్ 4) సాయంత్రం లాంఛ్‌ కానున్న ఈ మోస్ట్‌ అవైటెడ్‌ షో కోసం బిగ్‌బాస్ హౌస్‌ ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ సింగర్‌.. టైటిల్‌ నాదే అంటూ నెట్టింట్లో పోస్ట్‌
Bigg Boss
Follow us on

Bigg Boss Season 6 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్‌-6 మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఆదివారం (సెప్టెంబర్ 4) సాయంత్రం లాంఛ్‌ కానున్న ఈ మోస్ట్‌ అవైటెడ్‌ షో కోసం బిగ్‌బాస్ హౌస్‌ ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీజన్‌-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అక్కినేన నాగార్జున(Akkineni Nagarjuna)నే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచనున్నారు. కాగా ఈ సారి హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల వివరాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. సోషల్‌ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నా ఇంకా స్పష్టత క్లారిటీ లేదు. చలాకి చంటి.. యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో అర్జున్ కళ్యాణ్, కామెన్ మ్యాన్‌ రాజశేఖర్, శ్రీహాన్, దీపిక పిల్లి, వాసంత కృష్ణన్, గీతూ రాయల్‌, నటి శ్రీసత్య, అభినయ శ్రీ, రోహిత్, మెరీనా అబ్రహాం తదితరులు ఈషోలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్టార్‌ సింగర్ రేవంత్ (Singer Revanth) తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

జీవితంలో కొన్నిటిని వదిలేయడం కష్టంగానే ఉంటుంది. నా భార్యతో పాటు.. నాకు ఇష్టమైన మ్యూజిక్‌ని కూడా ఎంతో మిస్ అవుతున్నా. కానీ, ఒక భగీరథడిలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తా. మీ ఓట్లతో నన్ను గెలిపించండి. ఎంటర్ టైన్మెంట్‌కి అంతా సిద్ధమయింది. మీ ఆశీర్వాదాలతో టైటిల్ గెలిచి వస్తాను. త్వరలో కలుద్దాం’ అంటూ ఇన్ స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రేవంత్‌ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తద్వారా తాను బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళుతున్నట్లు చెప్పకనే చెప్పాడీ స్టార్‌ సింగర్‌.

రేవంత్ పెట్టిన పోస్టు ఇదే..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..