Sravanthi Chokarapu: ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ ఎమోషనల్.. ఏమైందంటే?

|

Nov 14, 2024 | 4:34 PM

టాలీవుడ్‌ స్టార్ యాంకర్లలో స్రవంతి చొక్కారపు కూడా ఒకరు. తన మాటల సవ్వడిత ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసే ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం చేతినిండా టీవీషోస్, సినిమా ఈవెంట్లతో బిజీ బిజీగా ఉండే ఈ యాంకరమ్మ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది.

Sravanthi Chokarapu: ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ ఎమోషనల్.. ఏమైందంటే?
Sravanthi Chokarapu
Follow us on

స్టార్ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టీవీ షోస్, స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార. గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ఆడియెన్స్ మనసులను కూడా గెల్చుకుంది స్రవంతి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అందాల యాంకరమ్మకు ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోయిన్స్ ని మించే అందంతో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే యాంకర్ స్రవంతి తాజాగా షాకింగ్ ఫొటోలను పెట్టింది. ఆస్పత్రి బెడ్ పై దీనంగా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు .ఇప్పుడు పెట్టక తప్పలేదు. కేవలం అవేర్‌నెస్ కోసం మాత్రమే స్పెషల్ గా “ఆడవారికోసం” ఈ పోస్ట్ షేర్ చేస్తున్నాను. గత 35 – 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్.రకరకాల మెడిసిన్ వాడాను.డాక్టర్ ని డైరెక్ట్ గా వెళ్లి కలిసే సమయం లేకపోవడంతో స్కానింగ్ చేపించుకోలేదు. ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు కంటిన్యూస్ గా జరిగింది. విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని. వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీ కి వెళ్లాల్సి వచ్చింది. ఈజీ గా కంప్లీట్ గా రికవర్ అవ్వాలి. ముందు లాగా నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడుతుందని చెప్పారు డాక్టర్’

ఇవి కూడా చదవండి

స్రవంతి ఎమోషనల్ పోస్ట్..

‘సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే. .అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేసాను మల్లి హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ,ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి,అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే.. హెల్త్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ . వర్క్,షూట్స్ ,ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చెయ్యకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి’ అని తన పోస్టులో రాసుకొచ్చింది స్రవంతి.

దీపావళి వేడుకల్లో యాంకర్ స్రవంతి..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.