
సాధారణంగా సీరియల్ తారలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం స్మాల్ స్క్రీన్ పై అడియన్స్ ముందుకు వస్తుంటారు. ఇక వీరి సంపాదన సైతం వేలల్లోనే ఉంటుంది. ఈమధ్య కాలంలో సీరియల్ హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఒక్క సీరియల్ హిట్టైతే రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ కేవలం రెండు సీరియల్స్ చేసింది. కానీ సంపాదన మాత్రం ఎక్కువే. తెలుగు, తమిళంలో పలు సీరియల్స్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా ప్రైవేట్ జెటు కొనుగోలు చేసిందని ప్రచారం నడుస్తుంది. అందుకు కారణం ఆమె ప్రైవేట్ జెట్ దగ్గర తీసుకున్న ఫోటోషూట్ షేర్ చేయడమే. ఇంతకీ ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారా.. ? తన పేరు అయేషా.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
బుల్లితెర ప్రేక్షకులకు ఈ అమ్మడు సుపరిచితమే. కన్నడ, తమిళంలో పలు సీరియల్స్ చేసిన అయేషా.. సావిత్రమ్మ గారి కొడుకు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సీరియల్ కు అప్పట్లో మంచి రెస్పాన్స్ రావడంతో అయేషాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఊర్వశివో రాక్షసివో సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ రెండు సీరియల్స్ చేసిన అయేషా.. తర్వాత తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉండిపోయింది. తమిళంలో వరుసగా సీరియల్స్ చేసింది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే హౌస్ లో ఫైర్ బ్రాండ్ లా మారిన అయేషా.. తనూజను టార్గెట్ చేస్తూ మరింత హైలెట్ అయ్యింది. టాప్ 5 కంటెస్టెంట్ ఇమేజ్ తో ఎంట్రీ ఇచ్చిన అయోషా.. అనారోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే గతంలో ఈ అమ్మడు ప్రైవెట్ జెట్ పక్కన తీసుకున్న ఫోటోస్ షేర్ చేయడంతో ఆమె ఆ జెట్ కొనుగోలు చేసిందని.. ఈ బ్యూటీ రేంజ్ మాములుగా లేదంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్. ఈ వార్తలపై అయేషా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..