Bigg Boss 7 Telugu : బిగ్‏బాస్ 7 కంటెస్టెంట్స్ ఫిక్స్.. వీళ్లే ఫైనల్ .. అస్సలు ఊహించలేరు..

|

Aug 20, 2023 | 4:01 PM

బుల్లితెరపై ఫేమస్ సెలబ్రెటీలు, యాంకర్స్, మోడల్స్, యూట్యూబర్స్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కూడా బిగ్‏బాస్ సీజన్ 7 హోస్ట్ నాగార్జున చేస్తుండగా.. కంటెస్టెంట్ ఫిక్స్ అయినట్లుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం బిగ్‏బాస్ సీజన్ 7 సందడి షూరు అయ్యింది. నాటకీయత, వినోదం, ఊహించని మలుపులతో ఈసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయినట్లుగా తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu : బిగ్‏బాస్ 7 కంటెస్టెంట్స్ ఫిక్స్.. వీళ్లే ఫైనల్ .. అస్సలు ఊహించలేరు..
Bigg Boss 7
Follow us on

ఇప్పుడు అడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పటివరకు ఆరు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 7వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఓవైపు వరుసగా ప్రోమోస్ రిలీజ్ చేస్తూ సీజన్ 7పై మరింత క్యూరియాసిటిని పెంచేస్తున్నారు నిర్వాహకులు.. మరోవైపు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ జాబితా చక్కర్లు కొడుతుంది. బుల్లితెరపై ఫేమస్ సెలబ్రెటీలు, యాంకర్స్, మోడల్స్, యూట్యూబర్స్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కూడా బిగ్‏బాస్ సీజన్ 7 హోస్ట్ నాగార్జున చేస్తుండగా.. కంటెస్టెంట్ ఫిక్స్ అయినట్లుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం బిగ్‏బాస్ సీజన్ 7 సందడి షూరు అయ్యింది. నాటకీయత, వినోదం, ఊహించని మలుపులతో ఈసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయినట్లుగా తెలుస్తోంది.

అయితే అనేకసార్లు కొందరి పేరు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ చివరకు కొందరి పేర్లు మాత్రం ఫిక్స్ అయ్యాయని ఇప్పుడు ఓ వార్త వినిపిస్తోంది. అందులో ఐశ్వర్య, అమర్‌దీప్, శోభ, అనూష, సందీప్, అంజలి, షెట్టాల్, మహేష్, యావర్, శుభశ్రీ, షావలి, అనిల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే యాంకర్ విష్ణు ప్రియ, జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, యాంకర్ రష్మీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితా ఎంతవరకు నిజమనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

బిగ్‏బాస్ 7 కంటెస్టెంట్స్ ఫిక్స్..

తెలుగు అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఇంట్లోకి ఈసారి దాదాపు 22 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 3న స్టార్ మాలో ప్రారంభం కానుంది. ఈసారి న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్, న్యూ గేమ్.. అంతా ఉల్టా పల్టా ఉండనుందని మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు నాగ్.

అమర్ దీప్ ఇన్ స్టా.. 

శోభా శెట్టి ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.