Bigg Boss Season 6: బిగ్‏బాస్ 6లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సెలబ్రెటీలు వీళ్లేనా ?..

|

Aug 10, 2022 | 6:51 PM

అయితే తాజాగా బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‏కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తుంది. వీరిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సెలబ్రెటీస్ కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Season 6: బిగ్‏బాస్ 6లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సెలబ్రెటీలు వీళ్లేనా ?..
Bigg Boss 6
Follow us on

బుల్లితెరపై ఇప్పటికీ బిగ్‏బాస్ (Bigg Boss Season 6) సందడి మొదలైంది. వరుస ప్రోమోలు రిలీజ్ చేస్తూ ఆడియన్స్‎ను అట్రాక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈషోలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ లీస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి 19 మంది కంటెస్టెంట్లలో పది మంది అమ్మాయిలు, తొమ్మిది మంది అబ్బాయిలు ఉండున్నారని తెలుస్తోంది. అందులో ఫేమస్ సెలబ్రెటీలతోపాటు.. బుల్లితెర యాంకర్స్, నటీనటులు ఉండనున్నారట. సెప్టెంబర్ 4న ఈ షోకు ప్రారంభం కానుండడంతో ఇప్పటికే కంటెస్టెంట్స్ ఫిక్స్ అయ్యారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో శ్రీహాన్, ఉదయభాను, యూట్యూబర్ ఆదిరెడ్డి, గలాటా గీతు, జబర్దస్థ్ అప్పారావు, చలాకీ చంటి, సంజనా చౌదరీ, యూట్యూబర్ నిఖిల్, హీరో నందు, చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‏కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తుంది. వీరిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సెలబ్రెటీస్ కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. యాంకర్ ఉదయభాను, హీరో నందు, చలాకీ చంటి, లైల్డ్ ఆర్టిస్ట్ భరత్ వీరికి అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. వీరికి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బిగ్‏బాస్ రియాల్టీ షో కోసం వీరికి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.