TV Shows: టీవీల్లో పిల్లల కోసం వచ్చే షోలకు పెరిగిన ఆదరణ..సక్సెస్ బాటలో భారతీయ కార్టూన్ షోలు!

|

Aug 22, 2021 | 11:10 AM

టీవీలో పిల్లలకు అందించే కంటెంట్, ముఖ్యంగా కార్టూన్ షోలు చాలా వరకు భారతీయీకరణ చెందాయి.

TV Shows: టీవీల్లో పిల్లల కోసం వచ్చే షోలకు పెరిగిన ఆదరణ..సక్సెస్ బాటలో భారతీయ కార్టూన్ షోలు!
Tv Shows
Follow us on

TV Shows: టీవీలో పిల్లలకు అందించే కంటెంట్, ముఖ్యంగా కార్టూన్ షోలు చాలా వరకు భారతీయీకరణ చెందాయి. కార్టూన్ షోలలో 2005 వరకు 80 శాతం కంటెంట్ విదేశీ.. 20 శాతం స్థానికమైనది ఉండేది. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. దేశంలో టాప్ 10 కార్టూన్ షోలలో 7 షోలు భారతీయ షోలు ఉన్నాయి. టాప్ 20 లో 15 షోలు స్థానిక షోలు కాగా.. 3 షోలు జపనీస్.. 2 షోలు పాశ్చాత్య దేశాలకు చెందినవి ఉన్నాయి. 2010 వరకు, దేశంలో పాప్యులర్ కార్టూన్ షోలలో విదేశీ..దేశీయ కంటెంట్ నిష్పత్తి 50:50 గా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

కార్టూన్ నెట్‌వర్క్..పోగో సౌత్ ఆసియా నెట్‌వర్క్ హెడ్ అభిషేక్ దత్తా మీడియాతో మాట్లాడుతూ, “కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌గా మారడానికి పెరుగుతున్న పోటీ ఒక ప్రధాన కారణం. గత 15 ఏళ్లలో దేశంలో కార్టూన్ ఛానెల్‌లు 6 రెట్లు పెరిగాయి. 2005 లో 4 పిల్లల ఛానెల్‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి ఛానెల్‌ల సంఖ్య 24 కి పెరిగింది. వీటిలో 13 జాతీయ స్థాయి ఛానెళ్లు.” అని చెప్పారు. ప్రస్తుతం దేశంలో తొమ్మిది ప్రాంతీయ.. 2 HD ఛానెల్‌లు ఉన్నాయి. దత్తా చెబుతున్న దాని ప్రకారం, మత గ్రంథాలలోని ప్రముఖ పాత్రలను ఆసక్తికరమైన రీతిలో ప్రదర్శించే కంటెంట్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. చోటా భీమ్ సక్సెస్ ఫలితం ఇది. పిల్లలకే కాకుండా పెద్ద వారికి కూడా ఇది బాగా నచ్చింది. ఒకప్పుడు మన టీవీల్లో పాప్యులర్ అయిన టామ్ అండ్ జెర్రీలా కృష్ణుని కథలు.. భీముని వృత్తాంతాలతో పిల్లల కోసం షోలు చేయొచ్చు. ఆసక్తికరంగా తీర్చి దిద్దితే ఈ కంటెంట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది.

ఇప్పుడు పిల్లలు పగటిపూట కూడా కార్టూన్ షోలను చూస్తున్నారు..

ఈ రంగంతో సంబంధం ఉన్న నిపుణులు కరోనా ఎఫెక్ట్ తో పిల్లల టీవీ చ్చోసే సమయం పెరిగిందని చెప్పారు. వార్తలు, సినిమాల తర్వాత, పిల్లల ఛానెల్‌కు వీక్షకుల సంఖ్య బాగా ఉంటోంది. 2019 తో పోలిస్తే 2020 లో పిల్లల వీక్షకుల సంఖ్య 31% పెరిగింది. పిల్లలు కూడా పగటిపూట కార్టూన్ షోలను చూస్తున్నారు. ఇంతకు ముందు సాధారణంగా సాయంత్రం కార్టూన్ షోలను చూడటానికి ఇష్టపడేవారు. స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తరువాత కార్టూన్ ఛానెల్ చూడటం ఇంతకుముందు ఉండేది. అంతేకాకుండా గతంలో టీవీలో మాత్రమే ఈ షోలను చూసే అవకాశం ఉండేది. ఇప్పుడు మొబైల్స్..టాబ్స్ లో కూడా అన్నిటిని చూడగలిగే అవకాశం వచ్చింది. అందువల్ల పిల్లలు ఇటువంటి కార్టూన్ కంటెంట్ చూసే సమయం బాగా పెరిగింది.

Also Read: Rakshabandhan 2021: ప్రేమతో రాఖీ కట్టిన మీ సోదరికి ఈ కానుక ఇవ్వండి..గ్యారెంటీగా ఇది ఆమె సంతోషాన్ని పదింతలు చేస్తుంది!

Corona Vaccine: మహిళలు టీకా తీసుకుంటే గర్భధారణకు ఇబ్బంది కలుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?