
బిగ్ బాస్ సీజన్ 9.. సెకండ్ లేడీ రన్నరప్ గా నిలిచింది తనూజ పుట్టస్వామి. ముద్ద మందారం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువైన ఈ అమ్మడు.. చాలా కాలం తర్వాత బిగ్ బాస్ షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసింది. మొదటి నుంచి టైటిల్ ఫేవరేట్ గా ఎక్కువ ఓటింగ్ తో దూసుకుపోయింది. ఓవైపు పాజిటివిటీ.. మరోవైపు నెగిటివిటీ..అయినా.. ఓటింగ్ లో ఏమాత్రం తగ్గకుండా చివరివరకు గట్టిపోటీ ఇచ్చింది. ఈ సీజన్ 9 కళ్యాణ్ పడాల విజేతగా నిలవగా.. రన్నరప్ గా నిలిచింది తనూజ. తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు వింటే ప్రతి ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశలకు ఎదురెళ్లి తనకు నచ్చిన రంగంలో సక్సెస్ అయిన ప్రతి ఆడపిల్ల తనూజ మాటలకు కనెక్ట్ అవుతారు.
తాజాగా విడుదలైన బజ్ ప్రోమోలో తనూజ మాట్లాడుతూ.. తన తండ్రి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ జర్నీ నీకు సంతృప్తిని ఇచ్చిందా అని హోస్ట్ శివాజీ అడగ్గా.. ఖచ్చితంగా సార్.. ఎందుకంటే మేము నవ్వాము.. ఏడ్చాము.. కోప్పడ్డాము.. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ ఇది బిగ్ బాస్… అంటూ చెప్పుకొచ్చింది. అలాగే శివాజీ మాట్లాడుతూ.. తనూజకు నచ్చినప్పుడేమో భరణిని నాన్నా అంటుంది.. నచ్చనప్పుడు సార్ అంటుంది.. ఎందుకు ? అని అడగ్గా.. తనూజ మాట్లాడుతూ.. ‘అక్కడకి వెళ్లింది గెలవడానికి.. నా గేమ్ నేను ఆడటానికి.. నాలో ఎంత ప్రేమ ఉన్నా.. ఎంత రెస్పెక్ట్ ఉన్న.. వాటన్నింటినీ పక్కన పెడితేనే నేను ఆడగల్గుతాను’ అని తెలిపింది.
తనూజ ఓ అవకాశవాది అనేది నిజమా ? అని శివాజీ అడగ్గా.. అలా అయితే పక్కనవాళ్లు గెలవాలని కోరుకోను కదా.. వేరే వాళ్లు లో అవుతుంటే వాళ్ల మైనస్ లు వాళ్లకు చెప్పేదాన్ని కాదు అని తెలిపింది. అలాగే డబ్బు కోసం పనిచేసేదాన్నైతే నేను కాదు. నా దేవుళ్లు అంటే నా ప్రేక్షకులు..వాళ్లే నన్ను చూసుకుంటారు అని చెప్పుకొచ్చింది.
మీ ఇద్దరి చేతులు నాగ్ సార్ పైకి ఎత్తినప్పుడు నీకేం అనిపించింది అని అడగ్గా.. “టాప్ 5లో ఉన్న అందరి పేరెంట్స్ వచ్చారు. అమ్మా, నాన్న వచ్చారు.. నేను చాలా ఎక్స్ పెక్ట్ చేశాను.. నా తండ్రి కూడా నా కోసం వస్తారని.. కానీ రాలేదు. కప్పు తీసుకుని వెళ్లి మా నాన్న ముందు పెట్టీ ఇది నీ కూతురు.. ప్రొఫెషన్ మారినంత మాత్రానా నీ కూతురు మారదు.. ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ ఉన్నా ఫ్యామిలీ పేరు నిలబెడుతుంది అని అనుకుంటారు.. తనూజ పుట్టస్వామి అనేది నా సర్ నేమ్ కాదు.. ఆయనపై ప్రేమ ఉంది కాబట్టే నేను చచ్చే వరకూ ఆయన పేరు నా పక్కన ఉంచుతాను” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తనూజ. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..