Dance Plus Title Winner : ముగిసిన స్టార్ మా డ్యాన్స్ ప్లస్ షో.. టైటిల్ విన్నర్ ఎవరో తెలుసా..?

|

May 23, 2021 | 11:34 PM

Dance Plus Title Winner : స్టార్‌ మా లో విజయవంతంగా ప్రసారమవుతున్న ‘డాన్స్ ప్లస్’ షో ఫైనల్ రోజు రానే వచ్చింది. టైటిల్ ఎవరు

Dance Plus Title Winner : ముగిసిన స్టార్ మా డ్యాన్స్ ప్లస్ షో.. టైటిల్ విన్నర్ ఎవరో తెలుసా..?
Dance Plus Title Winner
Follow us on

Dance Plus Title Winner : స్టార్‌ మా లో విజయవంతంగా ప్రసారమవుతున్న ‘డాన్స్ ప్లస్’ షో ఫైనల్ రోజు రానే వచ్చింది. టైటిల్ ఎవరు గెలుస్తారా అన్న ప్రేక్షకుల ఎదురుచూపుకు ముగింపు పలికింది. దేశవ్యాప్తంగా వచ్చిన 5,344 డిజిటల్ ఎంట్రీల నుంచి ఆడిషన్స్ నిర్వహించి 18 టీమ్స్ తో మొదలైన ఈ రసవత్తరమైన పోటీ దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి ప్రతిభ గల డాన్సర్లకు ఓ మంచి మంచి వేదిక కల్పించింది. పాన్ ఇండియా డాన్స్ షో గా ప్రేక్షకుల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని అందుకుంది.

ఓంకార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ షోను నడిపించారు. యానీ, రఘు, యశ్, బాబా, ముమైత్ ఖాన్, మోనాల్ గజ్జర్ ఇలా ఆరుగురు జడ్జ్‌లతో ఈ షోను నడిపించారు. 21 వారాలుగా సాగిన ఈ షో నేడు ముగిసింది. ముగింపు వేడుకలకు శేఖర్ మాస్టర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఫైనల్స్‌లో వాసి టోనీ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), సంకేత్‌ సహదేవ్‌ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్‌ బృందం), జియా ఠాకూర్‌ (అనీ మాస్టర్‌ బృందం), డార్జిలింగ్‌ డెవిల్స్‌ (రఘు మాస్టర్‌ బృందం) పోటీపడ్డారు.

ఈ సీజన్‌ విజేతగా సంకేత్‌ సహదేవ్‌ నిలువడంతో పాటుగా 20 లక్షల రూపాయల బహుమతినీ గెలుచుకున్నారు. ట్రోఫీని శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా అందించారు. మొత్తానికి ఓం కార్ మాత్రం బుల్లితెరపై మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఎంత పండగలా అనిపించినా పోటీని ఎదుర్కొనే ప్రతి కంటెస్టెంట్… తమ టాలెంట్ తో ఈ షోకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. తనదైన శైలిలో ప్రతి ఎపిసోడ్ నీ ఇంటరెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు ఓంకార్ ఫైనల్స్ ని మరింత పదునైన వ్యూహాలతో రసవత్తరంగా నడిపించారు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుష్ అయ్యే న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ టీజర్ వచ్చేస్తుందట…

Chiranjeevi, Ali : పేదలకు అండగా నిలుస్తున్న చిరంజీవి, అలీ.. కరోనా కష్టకాలంలో నిత్యావసరాల పంపిణీ..

Youngest survivor from Corona: కరోనా బారినుంచి బయటపడ్డ అత్యంత పిన్న వయస్కుడు కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!