‘ప్రభాస్ రాధేశ్యామ్’కు మ్యూజిక్ ఇవ్వనున్న తమన్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి 'జిల్' మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా..

ప్రభాస్ రాధేశ్యామ్కు మ్యూజిక్ ఇవ్వనున్న తమన్?

Edited By:

Updated on: Jul 21, 2020 | 1:16 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులకు తప్పకుండా మెప్పింస్తుందని ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అయితే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది ఇంత వరకూ క్లారిటీ రాలేదు. ఫస్ట్ ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది కూడా మ్యూజిక్ అందిస్తారని మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఎస్ ఎస్ తమన్‌కి అవకాశం ఇచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య తమన్ మ్యూజిక్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

బన్నీ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అందించిన మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో జోరుగా వైరల్ అయ్యాయి. దీంతో రాధేశ్యామ్ టీం తమన్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Read More:

ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..