జాను కోసం అప్పుడే మూడు స్కూల్స్ మారాను… అమ్మకు ఏడో తరగతిలోనే తెలుసు.. సింగర్ యశస్వి…

|

Apr 02, 2021 | 6:46 AM

Singer Yashaswi: సింగర్ యశస్వి.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల జీ తెలుగు నిర్వహించిన సరిగమప ప్రోగ్రామ్‏లో మాములు

జాను కోసం అప్పుడే మూడు స్కూల్స్ మారాను... అమ్మకు ఏడో తరగతిలోనే తెలుసు.. సింగర్ యశస్వి...
Yashaswi
Follow us on

Singer Yashaswi: సింగర్ యశస్వి.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల జీ తెలుగు నిర్వహించిన సరిగమప ప్రోగ్రామ్‏లో మాములు కంటెస్టెంట్‏గా అడుగుపెట్టిన ఈ కాకినాడ కుర్రాడు.. ‘నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ.. ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు’.. అంటూ జాను చిత్రంలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను అద్భుతంగా పాడి ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఈ పాట తర్వాత అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎక్కువగా మాట్లాడకుండా ఉండే అబ్బాయి.. సరిగమప విజేతగా నిలిచి.. మరోసారి తన సత్తా చాటుకున్నాడు.

తన పాటతోనే కాకుండా.. తన లవ్ స్టోరీతో కూడా ఫుల్ పాపులర్ అయ్యాడు. ఏకంగా తన ప్రేయసిని సరిగమప స్టేజ్ పైనే పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకోచ్చాడు యశస్వి. నేను కీబోర్డ్ ప్లేయర్‏ను.. మొదట్లో పాట పాడితే నా వాయిస్ అమ్మాయిలా వచ్చేది. తర్వాత తర్వాత నా వాయిస్ మారిపోయింది. ఇక ఆ తర్వాత కీ బోర్డ్ ప్లేయర్ నుంచి సింగర్‏గా మారాను. ఇక లాక్ డౌన్ సమయంలో సరిగమప ప్రోగ్రాం గురించి టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. అది చూసిన అమ్మ నువ్వు అందులోకి వెళ్తే బాగుంటుందని చెప్పింది. దీంతో కొన్ని సాంగ్స్ పాడి పంపించాను. ఆ తర్వాత వాళ్లు చేసిన సాంగ్స్ పాడాను. అయితే వాళ్లు లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడమని నన్ను అడిగారు. దీంతో నేను ఆ సాంగ్ పాడలేను అని షో నిర్వహకులకు దాదాపు 60 మెయిల్స్ వరకు పంపాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. చివరకు అదే సాంగ్ నా లైఫ్‏ను మార్చేసింది. యశస్వి లైఫ్.. లైఫ్ ఆఫ్ రామ్ ముందు.. లైఫ్ ఆఫ్ రామ్ తరువాత అన్నంత ఫేమస్ అయ్యాను. అమ్మనాన్న గవర్నమెంట్ ఆఫీస్‌లో జాబ్.. సైడ్ బిజినెస్‌గా ఆర్కెస్ట్రా రన్ చేసేవారు. నాకు పాటలు పాడాలన్న ఆసక్తి ఆర్కెస్ట్రా వల్లే వచ్చింది’ అంటూ చెప్పుకోచ్చాడు యశస్వి.

ఇక తన లవ్ స్టోరీ గురించి చెప్పుకుంటూ.. నేను ఏడవ తరగతి నుంచే జానును ప్రేమించాను. తన కోసం ఏకంగా మూడు స్కూల్స్ మారాను. తన కోసమే కాలేజీలో కూడా చేరాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను జానును ప్రేమిస్తున్నాననే విషయం మా అమ్మకు ఏడో తరగతిలోనే తెలుసు. కానీ నమ్మేది కాదు. ఏదో సరదాగా అంటున్నాడులే అని అనుకునేది. మా నాన్స కూడా లైట్ తీసకున్నారు. యశస్వి లైఫ్.. వైఫ్ ఆఫ్ రామ్ ముందు.. వైఫ్ ఆఫ్ రామ్ తరువాత అన్నంత ఫేమస్ అయ్యాను. అమ్మనాన్న గవర్నమెంట్ ఆఫీస్‌లో జాబ్.. సైడ్ బిజినెస్‌గా ఆర్కెస్ట్రా రన్ చేసేవారు. నాకు పాటలు పాడాలన్న ఆసక్తి ఆర్కెస్ట్రా వల్లే వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు ఇక సరిగమపలో నా లవర్‏గా జానును పరిచయం చేస్తున్నానని చెప్పినప్పుడు అలా ఎందుకు? అందరికి తెలియడం అని అన్నారు. కానీ మేం ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం.. పరిచయం చేస్తే తప్పేంటి? అని ఇంట్లో వాళ్లని ఒప్పించాం. ఇక వాళ్ల ఇంట్లో కూడా ఇష్టమే కానీ.. అలా పబ్లిక్‌లో పెట్టడం ఎవరికీ నచ్చదు కదా.. కాస్త ఆలోచించారు. కానీ మేం అవన్నీ వదిలేసాం. ఇక జీతెలుగు ద్వారా మేం ప్రేమికులం అని తెలిసిపోయింది.

Also Read: నన్ను కాస్త మాట్లాడనివ్వండి.. నాకు లేట్ అవుతుంది.. నేను వెళ్లాలి.. ఫ్యాన్స్ ముందు మొరపెట్టుకున్న రష్మిక..

ఇప్పటికే నాకు మూడు, నాలుగుసార్లు పెళ్లి చేసారు… ఆసక్తికర విషయాలను చెప్పిన కీర్తి సురేష్..