వివాదాలు ఎక్కడుంటే.. వర్మ అక్కడుంటాడు. నిత్యం వివాదాలకు సై అంటూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూంటాడు. ఒకవేళ ఏమీ లేకున్నా.. వాటిని సృష్టించడంలో మనోడి ట్రెండే వేరు. కొందరి ప్రముఖుల నిజ జీవితాల్లో జరిగిన.. సంఘటనలను తెరకెక్కించి.. విమర్శలు కొని తెచ్చుకోవడం మనోడికి కొత్తేమీ కాదు. ఇలా.. అందరి మీద.. సినిమాలు తీసిన ఆర్జీవీపై.. సినిమా తీస్తే ఎలా ఉంటుంది..? వినడానికి ఇది కాస్త విచిత్రంగా ఉండొచ్చు కానీ.. వర్మపై కూడా సినిమా తీసేవారున్నారు. అందుకు నేనేమీ తగ్గనంటున్నారు.. జొన్న విత్తుల. ఇప్పటికే ఈ సినిమాకి టైటిల్ కూడా జొన్న విత్తుల ప్రకటించారు.
‘పప్పు వర్మ’ అనే టైటిల్ పెట్టి.. సినిమా తీసి.. దాన్ని మియామాల్కోవాకు అంకితం ఇస్తానని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు జొన్నవిత్తుల. అయితే.. ఇప్పటికే ఆ సినిమాపై జొన్న విత్తుల పనులు ప్రారంభించేశారట. సేమ్.. వర్మలా ఉండే ఓ వ్యక్తిని.. బీహార్ నుంచి పట్టుకొచ్చి మరీ.. సినిమా చేస్తున్నారని సమాచారం. అచ్చం వర్మ మేనరిజంని దింపేలా.. అతనితో జొన్న విత్తుల ప్రాక్టీసులు చేపిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి.. ఈ సినిమా జొన్న విత్తులను ఎక్కడిదాకా తీసుకెళ్తుందో.
ఇటీవలే.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీసి.. వర్మ పలు విమర్శలకు గురయ్యాడు. ఆ సమయంలోనే.. మెగాస్టార్‌పై సినిమా అంటూ.. సోషల్ మీడియా వేదికగా.. ప్రకటించగా.. దీనిపై ప్రముఖ రచయిత జొన్న విత్తుల ఫైర్ అయ్యారు. వీరిద్దరి వివాదం కొద్ది రోజులు హాట్ టాపిక్‌గా నడిచింది.