ఇంట్రస్టింగ్ కాంబో: రానా, అక్షయ్ కుమార్, రాజ్ తరుణ్

| Edited By:

Mar 09, 2019 | 2:38 PM

కేవలం నటుడిగానే కాకుండా సినీ ఇండస్ట్రీలోని పలు విభాగాల్లో సత్తా చాటాలనుకుంటోన్న రానా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు, హిందీ భాషల్లో ఈ ఇద్దరు సినిమాలు నిర్మించాలనుకుంటుండగా.. వారి నిర్మాణంలో మొదటి సినిమా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను మెచ్చిన రానా ఆ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా తెలుగు కోసం రాజ్ తరుణ్‌ను హీరోగా ఫిక్స్ చేసినట్లు […]

ఇంట్రస్టింగ్ కాంబో: రానా, అక్షయ్ కుమార్, రాజ్ తరుణ్
Follow us on

కేవలం నటుడిగానే కాకుండా సినీ ఇండస్ట్రీలోని పలు విభాగాల్లో సత్తా చాటాలనుకుంటోన్న రానా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు, హిందీ భాషల్లో ఈ ఇద్దరు సినిమాలు నిర్మించాలనుకుంటుండగా.. వారి నిర్మాణంలో మొదటి సినిమా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను మెచ్చిన రానా ఆ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్, బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా తెలుగు కోసం రాజ్ తరుణ్‌ను హీరోగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే హిందీలో ఇంకా హీరో ఖరారు అవ్వలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చి, సెట్స్ మీదకు తీసుకెళ్లాలని రానా భావిస్తున్నాడట. ఇదే నిజమైతే వరుస పరాజయాల్లో ఉన్న రాజ్ తరుణ్‌కు మంచి ఆఫర్ వచ్చినట్లే.