NTR 30 Movie: సమంతా ఇన్.. రష్మిక ఔట్.!

|

Feb 25, 2020 | 3:29 PM

NTR 30 Movie: ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కొద్దిరోజుల కిందటే వెలువడింది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది. Also Read: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.! ఈ సినిమా షూటింగ్‌ సమ్మర్ తర్వాత మొదలుకానుండగా.. […]

NTR 30 Movie: సమంతా ఇన్.. రష్మిక ఔట్.!
Follow us on

NTR 30 Movie: ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కొద్దిరోజుల కిందటే వెలువడింది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది.

Also Read: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!

ఈ సినిమా షూటింగ్‌ సమ్మర్ తర్వాత మొదలుకానుండగా.. త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించబోతున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మిక స్థానంలో సమంతా అక్కినేనిని హీరోయిన్‌గా చిత్ర యూనిట్ తీసుకోనున్నారని తెలుస్తోంది. రష్మిక తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆమె పేరే వినిపించినా.. సడన్‌గా సమంతా పేరు తెరపైకి వచ్చింది.

Also Read: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై ఆన్లైన్‌లో ఫారెన్ లిక్కర్..!

త్రివిక్రమ్‌ గత చిత్రాలైన ‘అత్తారింటికి దారేది’, ‘సన్ అఫ్ సత్యమూర్తి’, ‘అఆ’ వంటి చిత్రాల్లో సమంతా నటించిన విషయం విదితమే. అయితే ఈ చిత్రం కోసం సమంతాను ఎంపిక చేశారన్న వార్తపై ఎటువంటి అఫీషియల్ న్యూస్ బయటికి రాలేదు. కాగా, పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

Also Read: Netflix Amazing Offer For New Users. Rs 5 Month Subscription