Andhadun Telugu Remake: ‘భీష్మ’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత నితిన్ బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్‌లో నటించబోతున్నాడు.
ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ని తీసుకున్నారని టాక్. ఇక మాతృకలో టబు పోషించిన పాత్ర కోసం స్టార్ హీరోయిన్ నయనతారను సంప్రదించనున్నారట చిత్ర యూనిట్. మరి ఈ సినిమాకు నయన్ ఒప్పుకుంటే మాత్రం అంచనాలు భారీగా పెరుగుతాయని చెప్పాలి.